AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వన్డే సిరీస్​‌ను వెంటాడుతున్న కోవిడ్-19.. ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య అన్ని మ్యాచులు రద్దు.. ఇదే కారణం

ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్​‌పై కోవిడ్-19 ప్రభావం పడింది. దీంతో వన్డే సిరీస్‌ను రద్దు చేశారు. జట్టు సిబ్బందితో పాటు పలువురు ఆటగాళ్లకు కరోనా  పాజిటివ్​గా..

వన్డే సిరీస్​‌ను వెంటాడుతున్న కోవిడ్-19.. ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య అన్ని మ్యాచులు రద్దు.. ఇదే కారణం
Sanjay Kasula
|

Updated on: Dec 08, 2020 | 4:59 AM

Share

ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్​‌పై కోవిడ్-19 ప్రభావం పడింది. దీంతో వన్డే సిరీస్‌ను రద్దు చేశారు. జట్టు సిబ్బందితో పాటు పలువురు ఆటగాళ్లకు కరోనా  పాజిటివ్​గా తేలిన నేపథ్యంలో ఇరుదేశాల బోర్డులు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

షెడ్యూల్​ ప్రకారం డిసెంబరు 4 తొలి వన్డే జరగాల్సి ఉండింది. కానీ అదే రోజు ఉదయం ఓ దక్షిణాఫ్రికా ఆటగాడికి పాజిటివ్​గా తేలింది. దీంతో తొలి వన్డేను డిసెంబరు 6 వాయిదా వేశారు. అప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉంటున్న హోటల్ సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకినట్లుగా సమాచారం.

దీంతో అనంతరం ఇంగ్లాండ్ బృందంలోని ఇద్దరు సభ్యులకు పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఫలితంగా వన్డే సిరీస్​ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వీలు చూసుకుని ఈ సిరీస్​ను తిరిగి నిర్వహిస్తామని వెల్లడించారు. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్​ను 3-0 తేడాతో ఇంగ్లాండ్ జట్టు సొంతం చేసుకుంది.