మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయను.. వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్!
మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయను.. ఇంకోసారి ఓట్లు అడుక్కోను అంటూ.. నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన కామెంట్స్ చేశారు. కార్యకర్తలు వచ్చినా, రాకపోయినా.. వాళ్ల కాళ్లు పట్టుకోనని ఆయన మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఏదైనా అవసరం వస్తే కార్యకర్తలే.. తన దగ్గరకు రావాలన్నారు. తాను ఏదో చేయాలని ఎమ్మెల్యేను అయ్యాను కానీ.. ఏదో అయ్యిందని వాపోయారు. ఇక చాలంటూ ఎమ్మెల్యే ఆర్థర్ నైరాశ్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. దీంతో.. అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా […]

మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయను.. ఇంకోసారి ఓట్లు అడుక్కోను అంటూ.. నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన కామెంట్స్ చేశారు. కార్యకర్తలు వచ్చినా, రాకపోయినా.. వాళ్ల కాళ్లు పట్టుకోనని ఆయన మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఏదైనా అవసరం వస్తే కార్యకర్తలే.. తన దగ్గరకు రావాలన్నారు. తాను ఏదో చేయాలని ఎమ్మెల్యేను అయ్యాను కానీ.. ఏదో అయ్యిందని వాపోయారు. ఇక చాలంటూ ఎమ్మెల్యే ఆర్థర్ నైరాశ్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. దీంతో.. అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కర్నూలులోని జూపాడు మండలం బన్నూరులోని ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఇలా వ్యాఖ్యలు చేశారు.
కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా ఆయన జూపాడు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన కార్యకర్తలు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రావడమేంటని ప్రశ్నించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లడిగి గెలిపిస్తే.. సమాచారం ఇవ్వకుండానే వచ్చారని కార్యకర్తలు ఎమ్మెల్యేను అడిగారు. దీంతో.. ఎమ్మెల్యే ఆర్థర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ రకమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన అలా మాట్లాడటం కర్నూలు నగర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.



