మరింత ఉధృతంగా రైతుల పోరు.. సకల జనుల సమ్మెకు సై
ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతంలోని రైతులు, ప్రజలు మలిదశ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు.. ఆందోళనకు దిగుతున్నారు. రాజధాని వికేంద్రీకరణను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 16 రోజులుగా అమరావతి అన్నదాతలు ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం తాము తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టు కనిపిస్తోంది. రాజధాని వికేంద్రీకరణకే మొగ్గు చూపుతోంది. ఇప్పటికే వైజాగ్‌లోని భీమిలి […]
ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతంలోని రైతులు, ప్రజలు మలిదశ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు.. ఆందోళనకు దిగుతున్నారు. రాజధాని వికేంద్రీకరణను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
16 రోజులుగా అమరావతి అన్నదాతలు ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం తాము తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టు కనిపిస్తోంది. రాజధాని వికేంద్రీకరణకే మొగ్గు చూపుతోంది. ఇప్పటికే వైజాగ్‌లోని భీమిలి ప్రాంతాన్ని రాజధానిగా చెబుతుండగా.. జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలును మార్చాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో సకల జనులతో సమ్మెను ఉధృతం చేయాలనుకుంటున్న రైతుల నిరసనలతో సర్కార్ ఏ మేరకు దిగివస్తుంది.. వారికి ఎలాంటి హామిని ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది.
అత్యవసర సేవలు మినహా అన్ని వర్గాలు సమ్మెలో పాల్గొనాలని పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. సచివాలయం, అసెంబ్లీ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు రైతులు. వ్యాపారులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో విధులకు దూరంగా ఉండి ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. రాజధానికి డబ్బులు లేవంటే జోలి పట్టి నిధులు సమీకరిస్తామని.. రాజధాని తరలించొద్దంటున్నారు ఉద్యమకారులు.