దమ్ముంటే నిరూపించండి.. జగన్ సర్కార్‌కు పరిటాల శ్రీరామ్ ఓపెన్ ఛాలెంజ్!

మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమ కుటుంబానికి సంబంధించి ఏపీ రాజధాని అమరావతిలో ఒక్క సెంటైనా భూమి ఉందని నిరూపిస్తే దాన్ని ప్రభుత్వానికే ఇచ్చేస్తామన్నారు. రాజధాని పేరుతో అనేక అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగా అమరావతి ప్రకటనకు ముందు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు చూపిస్తూ ఓ వీడియో ప్రెజెంటేషన్ కూడా ఇచ్చింది. అందులో పరిటాల సునీత కుమారుడు […]

దమ్ముంటే నిరూపించండి.. జగన్ సర్కార్‌కు పరిటాల శ్రీరామ్ ఓపెన్ ఛాలెంజ్!
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 03, 2020 | 12:22 PM

మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమ కుటుంబానికి సంబంధించి ఏపీ రాజధాని అమరావతిలో ఒక్క సెంటైనా భూమి ఉందని నిరూపిస్తే దాన్ని ప్రభుత్వానికే ఇచ్చేస్తామన్నారు. రాజధాని పేరుతో అనేక అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

దానికి అనుగుణంగా అమరావతి ప్రకటనకు ముందు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు చూపిస్తూ ఓ వీడియో ప్రెజెంటేషన్ కూడా ఇచ్చింది. అందులో పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్, అల్లుడు వడ్లమూడి శ్రీహర్ష ఆర్.ఆర్. ఇన్‌ఫ్రా ఎవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద రాజధాని ప్రకటన ముందే భూములు కొన్నారని ఆరోపించింది.

ఇక దీనిపై స్పందించిన పరిటాల శ్రీరామ్.. ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్‌కు సవాల్ విసిరారు. ‘మా పరిటాల కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక్క సెంటైనా భూమి ఉందని నిరూపిస్తే ఆ భూమి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేస్తాం.. మీ ప్రభుత్వానికి నిరూపించే దమ్ముంటే సవాలును స్వీకరించి ఆధారాలు చూపించండి’ అంటూ బహిరంగ సవాల్ చేశారు.