ఈ బామ్మ చాలా గ్రేట్.. పొలిటికల్ ఎంట్రీ@80.. వచ్చి రావడంతోనే ప్రత్యర్ధులకు షాక్..
ప్రస్తుత రాజకీయాల్లో వార్డు మెంబర్ గెలవాలన్నా.. చరిష్మాతో పాటు.. ధనం కూడా ఉండాల్సిందే. నిజాయితీగా డబ్బు లేకుండా ఓ కౌన్సిలర్‌గానో.. లేక సర్పంచ్ గానో ఎన్నికవ్వడం అంటే.. అది రికార్డ్ అన్నట్లే చెప్పుకోవాలి. ఇక లోకల్ బాడీ ఎలక్షన్ల గురించి చెప్పుకోనక్కర్లేదు. ఎంత పోటీ ఉంటుందో. అయితే అలాంటిది తమిళనాడులో ఓ ఎనభై ఏళ్ల బామ్మ.. రాజకీయ అరంగేట్రం చేసి.. అందర్నీ ఔరా అనిపించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగి.. అఖండ విజయం సాధించింది. వివరాల్లోకి […]
ప్రస్తుత రాజకీయాల్లో వార్డు మెంబర్ గెలవాలన్నా.. చరిష్మాతో పాటు.. ధనం కూడా ఉండాల్సిందే. నిజాయితీగా డబ్బు లేకుండా ఓ కౌన్సిలర్‌గానో.. లేక సర్పంచ్ గానో ఎన్నికవ్వడం అంటే.. అది రికార్డ్ అన్నట్లే చెప్పుకోవాలి. ఇక లోకల్ బాడీ ఎలక్షన్ల గురించి చెప్పుకోనక్కర్లేదు. ఎంత పోటీ ఉంటుందో. అయితే అలాంటిది తమిళనాడులో ఓ ఎనభై ఏళ్ల బామ్మ.. రాజకీయ అరంగేట్రం చేసి.. అందర్నీ ఔరా అనిపించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగి.. అఖండ విజయం సాధించింది.
వివరాల్లోకి వెళితే.. మధురై ప్రాంతంలోని వీరమ్మల్ అజగప్పన్ అనే వృద్ధురాలు.. మెలూర్ తాలుకాకు చెందిన అరిటప్పాటి గ్రామంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ పోటీల్లో ఏడుగురు పాల్గొన్నారు. ప్రత్యర్థులందరి కంటే ఎక్కువ ఓట్లు సంపాదించి.. విజయం సాధించింది. ప్రత్యర్థిపై ఏకంగా 190 ఓట్లను అధికంగా సాధించింది. అయితే ఈ ఏజ్‌లో ఈ విజయం ఎలా సాధ్యమైందని ప్రశ్నించగా.. గ్రామంలోని యువకులే తనను గెలిపించారని చెప్పుకొచ్చింది. తన వయస్సును లెక్కచేయకుండా.. గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు తెల్పింది. తన లక్ష్యం ప్రజలకు సేవ చేయడమేనిని స్పష్టం చేసింది.
Tamil Nadu: A 79-year-old woman, Veerammal Azhagappan, won local body election of Arittapatti Village in Melur Taluk of Madurai district. She says,”Youth of village have elected me. Irrespective of my age, I’ll work for the people”. pic.twitter.com/7XfYltW2YG
— ANI (@ANI) January 2, 2020