వాళ్లంతా బీఫ్ అందుకే తింటున్నారు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్య
ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. బీహార్‌లోని బెగుసరైలో భగవద్గీతకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వదేశాన్ని విడిచి.. విదేశాలకు వెళ్తున్న భారతీయ యువత.. మన సంస్కృతి, సంప్రదాయాలను మరచిపోయి.. బీఫ్ తినడం మొదలుపెడుతున్నారన్నారు. దీనికి ప్రధాన కారణం.. నేటి యువతకు మన సంస్కృతి, సంప్రదాయాల గురించి పెద్దలు వివరించకపోవడమేనన్నారు. ఇకపై అన్ని స్కూల్స్‌లలో భగవద్గీతను కచ్చితంగా బోధించేలా […]
ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. బీహార్‌లోని బెగుసరైలో భగవద్గీతకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వదేశాన్ని విడిచి.. విదేశాలకు వెళ్తున్న భారతీయ యువత.. మన సంస్కృతి, సంప్రదాయాలను మరచిపోయి.. బీఫ్ తినడం మొదలుపెడుతున్నారన్నారు. దీనికి ప్రధాన కారణం.. నేటి యువతకు మన సంస్కృతి, సంప్రదాయాల గురించి పెద్దలు వివరించకపోవడమేనన్నారు.
ఇకపై అన్ని స్కూల్స్‌లలో భగవద్గీతను కచ్చితంగా బోధించేలా చర్యలు చేపట్టాలన్నారు. మన పిల్లల్ని మిషనరీ స్కూల్స్‌కు పంపితే.. వారు అక్కడి నుంచి ఐఐటీ శిక్షణతో ఇంజనీర్లవుతూ విదేశాలకు వెళుతున్నారన్నారు. అలా వెళ్లిన వారిలో ఎక్కువ మంది బీఫ్ తినడానికి అలవాటుపడ్డారన్నారు. వారుకి చిన్నతనం నుంచి మన కల్చర్‌పై అవగాహన లేకపోవడమే.. ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో భగవత్ గీతా శ్లోకాలను బోధించాల్సిన అవసరం ఏర్పడిందన్న ఆయన.. దేశంలో తాము చేపట్టిన సర్వేలో 100 ఇళ్లకు గాను కేవలం 15 ఇళ్లలోనే హనుమాన్ చాలీసా, భగవద్గీత, రామాయణ పుస్తకాలు ఉన్నాయని తెలిసిందన్నారు. జరుగుతున్న పరిణామాలకు మనం పిల్లల్ని నిందించలేమని… సంస్కృతి, సంప్రదాయాలను రక్షించుకుంటేనే మన దేశం మనుగడ సాధ్యమన్నారు.