AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఏఏ ఎఫెక్ట్.. మరణించిన వ్యక్తికి నోటీసులు పంపిన యూపీ పోలీసులు!

రెండు వారాల క్రితం పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో 21 మంది మరణించారు. పోలీసు సిబ్బందితో సహా సాధారణ పౌరులు చాలా మంది గాయపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను పెద్ద ఎత్తున నాశనం చేశారని పోలీసులు ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో డిసెంబర్ 20 న జరిగిన ఘర్షణల్లో నలుగురు మరణించారు, ఈ క్రమంలో జరిగిన హింసపై 35 కేసులు నమోదయ్యాయి, వారిలో 29 మందిని గుర్తించగా, 14 మందిని ఫిరోజాబాద్ పోలీసులు […]

సీఏఏ ఎఫెక్ట్.. మరణించిన వ్యక్తికి నోటీసులు పంపిన యూపీ పోలీసులు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 03, 2020 | 11:22 AM

Share

రెండు వారాల క్రితం పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో 21 మంది మరణించారు. పోలీసు సిబ్బందితో సహా సాధారణ పౌరులు చాలా మంది గాయపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను పెద్ద ఎత్తున నాశనం చేశారని పోలీసులు ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో డిసెంబర్ 20 న జరిగిన ఘర్షణల్లో నలుగురు మరణించారు, ఈ క్రమంలో జరిగిన హింసపై 35 కేసులు నమోదయ్యాయి, వారిలో 29 మందిని గుర్తించగా, 14 మందిని ఫిరోజాబాద్ పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారు.

నిరసనలు తగ్గిన తరువాత, స్థానిక పోలీసులు కనీసం 200 మందికి నోటీసులు పంపారు. నిరసనలపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వాగ్దానం చేసిన తరువాత పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. అలాంటి ఒక నోటీసు బన్నే ఖాన్(94 సంవత్సరాలు) పేరిట ఉంది, అయితే.. అతను ఆరు సంవత్సరాల క్రితమే మరణించాడు. కాగా.. నెలల తరబడి మంచం పట్టే 93 ఏళ్ల ఫసహత్ మీర్ ఖాన్, న్యుమోనియాతో బాధపడుతూ ఢిల్లీ ఆస్పత్రి నుండి తిరిగి వచ్చిన 90 ఏళ్ల సూఫీ అన్సర్ హుస్సేన్ పేరిట ఇలాంటి నోటీసులుజారీ అయ్యాయి.

ఫసహత్ మీర్ ఖాన్ ఫిరోజాబాద్‌లోని ఒక కళాశాల స్థాపకుడు కాగా, హుస్సేన్ స్థానిక మసీదులో ఆరు దశాబ్దాలుగా కేర్‌టేకర్‌గా ఉన్నారు. ఇద్దరూ తమ స్థానిక శాంతి కమిటీలలో సభ్యులు. వారు ఏ ప్రాంతంలోనైనా శాంతిని కాపాడటానికి పోలీసులకు సహాయపడేవారు. ఇద్దరికీ జారీ చేసిన నోటీసులలో, వారు ప్రభుత్వ మేజిస్ట్రేట్ ముందు హాజరుకావాలని, రూ .10 లక్షల బాండ్ సమర్పించిన తరువాత బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలనిపేర్కొన్నారు.

“నేను డిసెంబర్ 25 న ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో ఉన్నాను, నిన్ననే తిరిగి వచ్చాను. వారు ఎందుకు ఇలా చేసారో నాకు తెలియదు. నగరంలో శాంతి నెలకొల్పడానికి నేను నా జీవితమంతా గడిపాను. ఈ వయసులో ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు” అని అన్సర్ హుస్సేన్ తెలిపారు. ఈ లోపాలను సరిదిద్దుతామని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.

“శాంతిని కొనసాగించడానికి మాపై చాలా ఒత్తిడి ఉంది, ఇవి వివిధ పోలీసు స్టేషన్ల నుండి వచ్చిన నివేదికల ఆధారంగా తీసుకున్న మధ్యంతర చర్యలు” అని ఫిరోజాబాద్ సిటీ మేజిస్ట్రేట్ కున్వర్ పంకజ్ సింగ్ తెలిపారు. వృద్ధులపై ఎటువంటి చర్యలు తీసుకోమని పంకజ్ సింగ్ స్పష్టంచేశారు.

ఫిరోజాబాద్‌తో సహా ఉత్తర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిరసనలను అణిచివేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రజా ఆస్తులను ధ్వంసం చేసినవారు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆదేశించింది. పౌరసత్వ (సవరణ) చట్టం ముస్లింలపై వివక్ష చూపడానికి రూపొందించబడిందని, రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలను ఉల్లంఘించిందని విమర్శకులు పేర్కొన్నారు.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు