రాకెట్ దాడి.. 8 మంది మృతి

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని ఎయిర్‌పోర్టుపై రాకెట్ దాడి జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో ఇరాన్‌, ఇరాక్‌కు చెందిన ఉన్నత స్థాయి కమాండర్ల సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ దాడిలో ఇరాన్ నిఘా అధికారి ఖాసీం సోలెమన్ కూడా మృతి చెందినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఆయన మృతితో ఇరాన్ విషాదంలో మునిగిపోయింది. ఈ దాడిలో రెండు కార్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితేదాడి ఎవరు చేశారన్నదానిపై అధికారులు సమాచారం సేకరించే […]

రాకెట్ దాడి.. 8 మంది మృతి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 03, 2020 | 11:28 AM

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని ఎయిర్‌పోర్టుపై రాకెట్ దాడి జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో ఇరాన్‌, ఇరాక్‌కు చెందిన ఉన్నత స్థాయి కమాండర్ల సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ దాడిలో ఇరాన్ నిఘా అధికారి ఖాసీం సోలెమన్ కూడా మృతి చెందినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఆయన మృతితో ఇరాన్ విషాదంలో మునిగిపోయింది. ఈ దాడిలో రెండు కార్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి.

అయితేదాడి ఎవరు చేశారన్నదానిపై అధికారులు సమాచారం సేకరించే పనిలో పడ్డారు. ఇరాన్‌ మద్దతుదారులు కొందరు రెండు రోజులక్రితం ఇరాక్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి చేయడంతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దానికి తీవ్రంగా పరిగణించిన అమెరికా.. ఇరాక్‌కు తమ అదనపు బలగాలను పంపింది.

వరుస దాడుల నేపథ్యంలో ఇరాక్‌ అట్టుడుకుతోంది. రాకెట్ల దాడి వెనుక ఇరాన్‌ హస్తం ఉండి ఉండొచ్చని ఇరాక్‌ అనుమానిస్తోంది. ఇరాక్‌, ఇరాన్‌ మధ్య ప్రచ్ఛన్నయుద్దం సాగుతోంది. ఈ నేపథ్యంలో రెండుదేశాలు దాడులకుదిగితే ప్రపంచసమస్యగా మారే అవకాశముంది. ఎందుకంటే అవి ఆయిల్‌ రిచ్‌ కంట్రీస్‌ కావడంతో.. చమురుకొరత ఏర్పడే ప్రమాదం ఉంది.