AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నార్సీ.. సీఏఏ మధ్య తేడా తెలియాలంటే… ? ఏది పవర్‌ఫుల్‌ ?

దేశంలో ప్రస్తుతం ఎన్నార్సీ, సీఏఏ అంశాలు హాట్ టాపిక్‌గా మారాయి. వీటి మధ్య తేడాలేంటి ? ముఖ్యంగా సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. అనేక రాష్ట్రాల్లో .. యూపీ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి చోట్ల విద్యార్థులు, ఆందోళనకారులు రెచ్చిపోయి ప్రదర్శనలకు దిగారు. పోలీసులకు, వారికి మధ్య జరిగిన ఘర్షణల్లో అనేకమంది గాయపడ్డారు. ఒక్క యూపీలోనే పోలీసు కాల్పుల్లో సుమారు 18 మంది మృతి చెందారు. అయితే …ఎన్నార్సీ (జాతీయ పౌర జాబితా) […]

ఎన్నార్సీ.. సీఏఏ మధ్య తేడా తెలియాలంటే... ?  ఏది పవర్‌ఫుల్‌ ?
Anil kumar poka
|

Updated on: Dec 25, 2019 | 5:11 PM

Share

దేశంలో ప్రస్తుతం ఎన్నార్సీ, సీఏఏ అంశాలు హాట్ టాపిక్‌గా మారాయి. వీటి మధ్య తేడాలేంటి ? ముఖ్యంగా సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. అనేక రాష్ట్రాల్లో .. యూపీ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి చోట్ల విద్యార్థులు, ఆందోళనకారులు రెచ్చిపోయి ప్రదర్శనలకు దిగారు. పోలీసులకు, వారికి మధ్య జరిగిన ఘర్షణల్లో అనేకమంది గాయపడ్డారు. ఒక్క యూపీలోనే పోలీసు కాల్పుల్లో సుమారు 18 మంది మృతి చెందారు. అయితే …ఎన్నార్సీ (జాతీయ పౌర జాబితా) అన్నది వేరు.. ఇది అక్రమ శరణార్ధుల ఏరివేతకు ఉద్దేశించినది. ఉదాహరణకు పొరుగునున్న బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు శరణార్థులుగా వచ్చి ..ఆస్సాం రాష్ట్రంలో తలదాచుకున్నారు. వీరివల్ల స్థానికులకు ఉద్యోగావకాశాలు ఇతర ప్రయోజనాలు తగ్గిపోయాయి. తాము కూడా అస్సామీయులమేనని అనేకమంది శరణార్థులు ప్రభుత్వానికి మొర పెట్టుకోవడంతో ఇది అధికారులకు సమస్యగా మారింది. దీంతో ఎవరు అసలైన అస్సామీయులో, ఎవరు శరణార్థులో నిర్ధారించేందుకు ప్రభుత్వం మొదట ఎన్నార్సీ‌ని అమలు చేసింది. అయితే ఆ జాబితాలో లొసుగులు ఉండడంతో .. తిరిగి సవరించిన జాబితాకు కసరత్తు చేసింది. ఈ క్రమంలో 19 లక్షలమంది పేర్లను జాబితా నుంచి తొలగించారు. కానీ వారు తాము స్థానికులమేనని నిరూపించుకునేందుకు తగిన డాక్యుమెంట్లతో ట్రిబ్యునల్స్ లేదా కోర్టులను ఆశ్రయించవచ్చునని వెసులుబాటును కల్పించారు. ఈ రాష్ట్రంలోని ప్రజలు తాము లేదా తమ పూర్వీకులు 1971 మార్చి 21 నాటికి, లేక అంతకుముందు నుంచే ఈ రాష్ట్రంలో నివసిస్తూ వచ్చామని రుజువు చేసుకోవలసి ఉంటుంది.

ఇక సవరించిన పౌరసత్వ చట్ట విషయానికే వస్తే.. ఇది ఎన్నార్సీ కన్నా ప్రధానమైనది.. శక్తిమంతమైనది కూడా.. దీన్ని మత ప్రాతిపదికపై రూపొందించారు. మూడు పొరుగు దేశాల్లోని ముస్లిమేతరులకు ఈ దేశంలో పౌరసత్వం కల్పించడానికి ఇది ఉద్దేశించినది. మతం పేరిట బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో వివక్షను ఎదుర్కొంటున్న హిందువులు, సిక్కులు, జైనులు, క్రైస్తవులకు ఈ దేశ పౌరసత్వం కల్పించాలన్నదే ఈ చట్ట ఉద్దేశం. కానీ.. ఈ చట్టం వల్ల తమకు మేలుకన్నా కీడే ఎక్కువగా జరుగుతుందని ఇక్కడి ముస్లిం మైనారిటీలు ఆందోళన చెందుతున్నారు. చట్టం కాక ముందు ఈ బిల్లు-మత సంబంధ మైనారిటీలకు భద్రత కల్పించలేదు. ఇస్లామిక్ దేశాల్లో . పరాయి దేశాలనుంచి శరణార్థులుగా వఛ్చిన ముస్లిములను ఆ దేశాల్లో స్థానికులుగానే పరిగణిస్తున్న కారణంగా వారికి భద్రత ఉందని, కానీ మైనారిటీలుగా మారిన హిందువుల వంటి వర్గాలకు ఇలాంటి రక్షణ లేదన్నదే ప్రభుత్వ అభిప్రాయం. అందుకే ఇక్కడికి శరణార్థులుగా వచ్ఛే ఈ వర్గాలకు ఈ దేశ పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టాన్ని తెచ్చింది. ఇక్కడి ముస్లిములు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అసలు ఈ చట్టానికి ముస్లిములకు సంబంధమే లేదని మోడీ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. కాగా-ఎన్నార్సీ కన్నా ఈ చట్టాన్ని సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టులో దాదాపు 60 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రాథమికంగా విచారణ జరిపిన కోర్టు. . స్టే జారీ చేసేందుకు నిరాకరిస్తూనే.. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించేదిగా ఉందన్న పిటిషనర్ల వాదనపై మీ సమాధానమేమిటో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై సమగ్ర విచారణ జనవరిలో జరగాలని నిర్ణయించింది.