AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trypanophobia: అమ్మో సూది మందా..టీకా వద్దు..అంటున్న వారికి వ్యాక్సిన్ ఎలా ఇప్పించాలి? అసలు వారెందుకు భయపడతారు?

Trypanophobia: సూది మందు వేయించుకోవాలంటే చాలా మందికి భయం..ఇంజక్షన్ చేయిన్చుకోవాలంటేనే వణికిపోతారు. ఆకారణంతోనే చాలా మంది ఎంత అనారోగ్యం చేసినా.. డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి విముఖత చూపిస్తారు.

Trypanophobia: అమ్మో సూది మందా..టీకా వద్దు..అంటున్న వారికి వ్యాక్సిన్ ఎలా ఇప్పించాలి? అసలు వారెందుకు భయపడతారు?
Trypanophobia
KVD Varma
|

Updated on: Jun 01, 2021 | 6:46 PM

Share

Trypanophobia: సూది మందు వేయించుకోవాలంటే చాలా మందికి భయం..ఇంజక్షన్ చేయిన్చుకోవాలంటేనే వణికిపోతారు. ఆకారణంతోనే చాలా మంది ఎంత అనారోగ్యం చేసినా.. డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి విముఖత చూపిస్తారు. ఒకవేళ వెళ్ళినా వైద్యుడికి కండిషన్ కూడా పెడతారు. నాకు మందులు ఎన్నయినా రాయండి.. కానీ, ఇంజక్షన్ మాత్రం వద్దు అని. ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ నడుస్తున్న సమయంలో ఇటువంటి వారు సూదికి భయపడి టీకా తీసుకోకుండా ఉండిపోతున్నారు. అసలు ఈ సూది మందు భయం ఎందుకు కలుగుతుంది. వారు సూది మందు విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కుంటారు. వారికి ప్రత్యామ్నాయం ఏముంటుంది. వ్యాక్సిన్ తీసుకోవడానికి వారికి ఎలా సహకరించాలి వంటి అంశాలు తెలుసుకుందాం.

సూది మందు అంటే ఉండే భయాన్ని ట్రిపనోఫోబియా అంటారు. ఇది సూదుల పట్ల తీవ్ర భయం ఉండే మానసిక స్థితి అని వైద్యులు చెబుతున్నారు. ఈ సూదిభయం ఉన్నవారు కొన్ని శారీరక లక్షణాలు అనుభవిస్తారు. తక్కువ రక్తపోటును (వాసోవాగల్ రియాక్షన్) కలిగి ఉంటారు. వీరు సూదుల గురించి ఆలోచిస్తున్నపుడు దీనివలన స్పృహ కూడా కోల్పోయే అవకాశం ఉంటింది. సాధారణంగా వీరు బాల్యంలో చూసిన సంఘటనల వల్ల కానీ, తమ దగ్గర వారు ఎవరైనా ఎక్కువ కాలంపాటు రుగ్మతలతో బాధపడుతూ వైద్యసహాయం పొందటాన్ని దగ్గరనుంచి చూడటం వలన ఇంజక్షన్ అంటే భయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ ఇంజక్షన్ భయం ప్రజారోగ్య సమస్యగానే చెప్పొచు. ఎందుకంటే, 2019 లో అనేక దేశాలలో నిర్వహించిన విశ్లేషణల్లో దాదాపుగా 16 శాతం పెద్ద వయసు వారు ఇంజక్షన్ భయంతో టీకాలను వేయించుకోలేదు. వీరు ఫ్లూ టీకాలు కూడా తీసుకోలేదు.

క్లినికల్ సైకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ మేఘన్ మెక్‌ముర్ట్రీ చెబుతున్న దాని ప్రకారం..వివిధ దేశాలలో నిర్వహించిన అధ్యయనాలలో, ప్రతి 10 మందిలో ఒకరు టీకాలు వేయడాన్ని పూర్తిగా నిరాకరిస్తారని దీనికి కారణం ఇంజక్షన్ అంటే ఉన్న భయమేనని తేలింది.

ఇందుకోసం ఇంజక్షన్ భయం ఉన్నవారి విషయంలో ఎలా వారికి టీకా ఇప్పించాలి అనే అశంపై వైద్యనిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు..అవి ఇవీ..

  • ముందుగానే ఆ వ్యక్తికి టీకా ప్రాధాన్యత అదేవిధంగా టీకా తీసుకోకపోతే వచ్చే అనర్ధాల పై అవగాహన కల్పించాలి.
  • టీకా ఇంజక్షన్ రూపంగా తప్పితే మరోరకంగా ఇవ్వలేరని చెప్పాలి.
  • దగ్గరలోని వ్యాక్సినేషన్ సెంటర్ కు తీసుకువెళ్ళి టీకా వేయించుకుంటున్న వారిని చూపించి వారు ఎంత చక్కగా టీకా తీసుకుంటున్నారో తెలిసేలా చేయాలి.
  • ముఖ్యంగా వారికి బాగా కావలసిన వ్యక్తులు టీకా ఇప్పించే సమయంలో వారితో కూడా ఉండాలి.
  • టీకా వేయించే ముందు వారికి సంగీతాన్ని చెవిలో వినిపించేలా ఏర్పాటు చేయాలి.
  • టీకా కేంద్రంలో ఈ వ్యక్తికి ఇంజక్షన్ అంటే ఉన్న భయాన్ని ముందుగానే చెప్పి.. టీకా సిరెంజిలోకి లోడ్ చేసి పెట్టుకుని వీరిని దగ్గరకు పిలిచేలా ఏర్పాటు చేయాలి.
  • ముఖ్యంగా టీకా ఇస్తున్న సమయంలో అతని దృష్టి సిరెంజి పైకి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read: Bird Flu: చైనాలో మరో వైరస్.. బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన వ్యక్తి గుర్తింపు.. పెద్ద ప్రమాదకారి కాదన్న అధికారులు!

Vedika: పదకొండు నెలల చిన్నారి ‘వేదిక’ కు ప్రపంచంలోనే ‘అతి ఖరీదైన’ చికిత్స.. దీని ఖర్చు ఎంతంటే..