మాస్క్ ధరిస్తారా?.. జరిమానా కడతారా?.. మూడేళ్లు జైలుకెళ్తారా?

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో నగరపాలక సంస్థ

మాస్క్ ధరిస్తారా?.. జరిమానా కడతారా?.. మూడేళ్లు జైలుకెళ్తారా?
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2020 | 6:01 PM

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో నగరపాలక సంస్థ మరిన్ని కఠిన నిబంధనలకు సిద్ధమైంది. ఇకపై ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, లేకుంటే రూ. 5 వేల జరిమానా లేదంటే మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద అహ్మదాబాద్ మునిసిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా ఆదివారం ఈ ఆదేశాలు జారీ చేశారు.

కాగా.. రేపటి (సోమవారం) నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ఉదయం ఆరు గంటల నుంచి నగర పరిధిలో ప్రతి ఒక్కరు బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరని కమిషనర్ పేర్కొన్నారు. మాస్క్ లేకుండా కనిపించిన వారికి రూ. 5 వేల జరిమానా విధిస్తామని, చెల్లించడంలో విఫలమైతే మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. మార్కెట్లో దొరికేవైనా, ఇంట్లో తయారుచేసినవి అయినా ఫరవాలేదని ఆయన వివరించారు. కనీసం ముఖానికి రుమాలైనా కట్టుకోవాలని సూచించారు.

ఇప్పుడు కోవిద్ 19 దేశంలోని అని ప్రాంతాలకు విస్తరిస్తోంది. దీంతో.. వ్యాపారులు, దుకాణదారులు సహా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, వందశాతం అందరూ నిబంధనలు పాటిస్తారని భావిస్తున్నట్టు కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలో 19 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 266కు పెరిగింది. గుజరాత్‌లోనే ఇది అత్యధికం. అలాగే, నగరంలో 11 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు.