పశ్చిమ బెంగాల్ లో మేమే గెలుస్తాం, అధికారం మాదే, 200 సీట్లకు పైగా గ్యారంటీ , బీజేపీ ధీమా

బెంగాల్ లో 200 కి పైగా సీట్లలో విజయం సాధిస్తామని, రాష్ట్రంలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని...

పశ్చిమ బెంగాల్ లో మేమే గెలుస్తాం, అధికారం మాదే, 200 సీట్లకు పైగా గ్యారంటీ , బీజేపీ ధీమా
We Will Win In Bengal Elections Says Bjp
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 30, 2021 | 11:22 AM

బెంగాల్ లో 200 కి పైగా సీట్లలో విజయం సాధిస్తామని, రాష్ట్రంలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని, బీజేపీ రెండో స్థానంలో వస్తుందని ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన ఫలితాలను బీజేపీ ఐటీ విభాగం చీఫ్, బెంగాల్ బీజేపీ ఇన్-ఛార్జి కూడా అయిన అమిత్ మాలవీయ కొట్టి పారేశారు. వీటి ఆధారంగా కచ్చితంగా  ఓ నిర్ణయానికి రాలేమని ఆయన చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఎన్ని లెక్కలు చెప్పినా ఈ ఎన్నికల్లో మేం 200 సీట్లకు పైగా విజయం సాధిస్తాం.. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మా పార్టీ ఈ రాష్ట్రం నుంచి  18 సీట్లను గెలుచుకుంటుందని ఎవరూ అంచనావేయలేదు అని ఆయన అన్నారు. కానీ ఇన్ని స్థానాలను గెలుచుకుని అందరినీ షాక్ కి గురి చేసిందని అమిత్ మాలవీయ పేర్కొన్నారు. మే 2 వరకు వేచి చూద్దాం, తొందరెందుకు అని వ్యాఖ్యానించారు. ఈ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గోపాల కృష్ణ అగర్వాల్ కూడా ఎగ్జిట్ పోల్స్ ని నమ్మడానికి వీల్లేదన్నారు.  బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, కేంద్రంతో సఖ్యతగా లేని మమతా బెనర్జీ కారణంగా తాము కేంద్ర పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను పొందలేకపోయామని భావిస్తున్నారని ఆయన అన్నారు. బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. మెజారిటీ సాధిస్తాం… మా పార్టీ అధికార పగ్గాలు చేపడుతుందని అన్నారు.

అటు-పశ్చిమ బెంగాల్ లో టీఎంసీదే విజయమని అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసినప్పటికీ యాక్సిస్ మై ఇండియా టుడే, రిపబ్లిక్ సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ సర్వే కమలం పార్టీకే ‘పట్టం’ కట్టింది.