నీటితో నడిచే వాహనాలు వస్తాయా..?
పెట్రో, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న ధరల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న మరో ఐదేళ్లలో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. 1989లో లీటర్ పెట్రోల్ ధర రూ. 8.50 పైసలు ఉండేది. 1999లో రూ. 23.80 పైసలయ్యింది. ఇక 2009లో 44 రూపాయలకి చేరింది. 2019లో ఏకంగా లీటర్ పెట్రోల్ ధర 76 రూపాయల 46 పైసలకి చేరుకుంది. ఒకప్పుడు పైసల్లో మాత్రమే పెరిగిన చమురు […]
పెట్రో, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న ధరల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న మరో ఐదేళ్లలో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. 1989లో లీటర్ పెట్రోల్ ధర రూ. 8.50 పైసలు ఉండేది. 1999లో రూ. 23.80 పైసలయ్యింది. ఇక 2009లో 44 రూపాయలకి చేరింది. 2019లో ఏకంగా లీటర్ పెట్రోల్ ధర 76 రూపాయల 46 పైసలకి చేరుకుంది. ఒకప్పుడు పైసల్లో మాత్రమే పెరిగిన చమురు ధరలు ఇప్పుడు ఏకంగా రూపాయల్లో పెరుగుతున్నాయి. దీంతో పెట్రోల్ కి ప్రత్యామ్నాయం కనుగొనే పనిలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నీటితో నడిచే వాహనాలు అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. పెట్రోల్, డీజీల్ రేట్లు తలకు భారంగా మారాయని సామాన్యులు చెబుతున్నారు. నీటితో నడిచే వాహనాలు అందుబులోకి వస్తే ఎంచక్కా తిరొగొచ్చని అంటున్నారు. పెట్రోల్ అయిపోతుందనే భయం లేకుండా ఉంటుందని.. అది ఒక కొత్త అనుభూతి అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.