AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెజాన్‌ అడవులకు స్టార్ హీరో రూ.36 కోట్ల విరాళం!

అమెజాన్‌ అడవులు మనుషులు ఎంత ఉపయోగకరమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భూమి మీద లభించే 20 శాతం ప్రాణవాయువుకు అవే ఆధారం. తాజాగా కార్చిచ్చు రేగి.. చెట్లు, వన్యప్రాణులు దగ్ధం అయిపోతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా చెట్లు నాటాలని కోరారు. కాగా అమెజాన్‌ అడవుల కోసం ప్రముఖ హాలీవుడ్‌ హీరో లియోనార్డో డికాప్రియో విరాళం అందించేందుకు ముందుకొచ్చారు. ఆయన జులైలో ‘ఎర్త్‌ అలయన్స్‌’ […]

అమెజాన్‌ అడవులకు స్టార్ హీరో రూ.36 కోట్ల విరాళం!
Leonardo DiCaprio's Earth alliance fund to donate USD 5 million in aid amid Amazon fires
Ram Naramaneni
|

Updated on: Aug 26, 2019 | 6:42 PM

Share

అమెజాన్‌ అడవులు మనుషులు ఎంత ఉపయోగకరమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భూమి మీద లభించే 20 శాతం ప్రాణవాయువుకు అవే ఆధారం. తాజాగా కార్చిచ్చు రేగి.. చెట్లు, వన్యప్రాణులు దగ్ధం అయిపోతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా చెట్లు నాటాలని కోరారు. కాగా అమెజాన్‌ అడవుల కోసం ప్రముఖ హాలీవుడ్‌ హీరో లియోనార్డో డికాప్రియో విరాళం అందించేందుకు ముందుకొచ్చారు. ఆయన జులైలో ‘ఎర్త్‌ అలయన్స్‌’ అనే పర్యావరణ ఫౌండేషన్‌ను స్థాపించారు. దీని ద్వారా 5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.36 కోట్లు) విరాళం ఇవ్వనున్నట్లు లియోనార్డో ప్రకటించారు. అమెజాన్‌ అడవుల సంరక్షణ, అక్కడి ప్రజలు, వన్యప్రాణుల సంరక్షణ కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు తమ వంతు సహాయం చేయాలంటూ ఆయన ఫాలోవర్స్‌ను కోరారు. విరాళంగా ఇచ్చిన ప్రతి రుపాయి అమెజాన్‌ సంరక్షణ కోసం ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు.