50 వేల కొత్త ఉద్యోగాలు.. రోజుకు 5 వేల నియామకాలు..!

కరోనావైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఓ వైపు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో.. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాలని

50 వేల కొత్త ఉద్యోగాలు.. రోజుకు 5 వేల నియామకాలు..!
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2020 | 1:38 PM

కరోనావైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఓ వైపు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో.. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ప్రముఖ రిటైల్ కంపెనీ వాల్ మార్ట్ తాజాగా 50 వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటించింది. కోవిద్-19 వల్ల నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో వినియోగదారుల నుండి డిమాండ్ భారీగా పెరిగిందని అందుకే ఉద్యోగులను నియమించుకుంటామని పేర్కొంది.

కాగా.. వాల్‌మార్ట్.. అమెరికాలో అతిపెద్ద ప్రైవేట్ కంపెనీగా ఉంది. ఏకగా 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ప్రస్తుతం రోజుకు సగటున 5 వేల మందిని నియమించుకుంటోంది. వాల్ మార్ట్ స్టోర్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో వీరికి ఉపాధి కల్పిస్తోంది. మళ్లీ ఇప్పుడు 50 వేల మందిని అదనంగా నియమించుకుంటామని పేర్కొంది. డ్రైవర్లు, క్యాషియర్లు, స్టాకర్లు, స్టోర్లలో పర్సనల్ షాపర్స్, ప్యాకర్స్ వంటి విధుల కోసం 50 వేల మందిని తీసుకుంటామని వాల్ మార్ట్ పేర్కొంది.