Vote For Note Case : ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం..అతడిపై నాన్ బెయిలబుల్ వారంట్

2015లో తెలంగాణలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలలో సెగలు రేపుతోంది. ఏసీబీ కోర్టులో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ వేగంగా సాగుతోంది.

Vote For Note Case : ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం..అతడిపై నాన్ బెయిలబుల్ వారంట్
Follow us

|

Updated on: Dec 15, 2020 | 8:09 PM

2015లో తెలంగాణలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలలో సెగలు రేపుతోంది. ఏసీబీ కోర్టులో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ వేగంగా సాగుతోంది. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై విచారణ ప్రక్రియను ఏసీబీ కోర్టు ప్రారంభించింది. సండ్రపై అవినీతి నిరోధక చట్టంలోని 12, ఐపీసీ 120బి రెడ్ విత్ 34 సెక్షన్లతో అభియోగాలు నమోదయ్యాయి.  ఏసీబీ అభియోగాలను సండ్ర వెంకట వీరయ్యకు న్యాయస్థానం చదివి వివరించింది. ఏసీబీ మోపిన అభియోగాలను సండ్ర తోసిపుచ్చారు. కేసుకు సంబంధించి సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ కోర్టుకు హాజరయ్యారు. గైర్హాజరైన ఉదయ్ సింహాపై ఏసీబీ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.  కేసు విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది.

కాగా ఇటీవల ఓటుకు నోటు కేసు నుంచి తన పేరును తొలగించాలని ఎమ్మెల్యే డిశ్చార్జ్ పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కేసుల్లో మినహాయింపు కోసం పిటిషన్లను అనుమతించబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది.

Also Read :