బాసర వచ్చిన ‘డాటర్ ఆఫ్ ఇండియా’ గీత.. దాదాపు 20 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రుల కోసం..
తన చిన్నతనంలో తప్పిపోయి పాకిస్తాన్ చేరుకున్న 'డాటర్ ఆఫ్ ఇండియా' గీత గురించి అందరికి తెలిసిందే. అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరో నటించిన బజరంగి భాయిజాన్

తన చిన్నతనంలో తప్పిపోయి పాకిస్తాన్ చేరుకున్న ‘డాటర్ ఆఫ్ ఇండియా’ గీత గురించి అందరికి తెలిసిందే. అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరో నటించిన బజరంగి భాయిజాన్ సినిమా తర్వాత గీత పేరు దేశంలో మారుమోగింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం గీత తనవారి నుంచి తప్పిపోయి పాకిస్తాన్కు చేరుకుంది. అక్కడి ఈద్ ఫౌండేషన్లో 15 సంవత్సరాలు గడిపింది. తర్వాత మాజీ విదేశాంగ మంత్రి, దివంగత సుష్మాస్వరాజ్ సహకారంతో ఇండియాకు తిరిగి వచ్చింది. అయితే మంగళవారం గీత బాసరకు వచ్చింది. తన తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న గీత ప్రముఖ ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్ మధ్యప్రదేశ్ వారి సహకారంతో బాసరకు వచ్చింది. ప్రస్తుతం ఆనంద్ సర్వీస్ సొసైటీలో గీత ఉంటుంది. ఈ క్రమంలో తమ ప్రాంతంలో ఇడ్లీలు తినేవారని.. ధాన్యం ఎక్కువగా పండించేవారని గీత సైగలతో తెలిపింది. దీంతో ఆమె చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం గీత తల్లిదండ్రుల కోసం ఆనంద్ సొసైటీ వెతుకుతూనే ఉంది. ఇప్పటి వరకు తనవారి ఆచూకీ లభించలేదు.
