AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vodafone Idea Offer: వోడాఫోన్ ఐడియా ఆఫర్ అదుర్స్… వన్ ఇయర్ ప్లాన్‌తో పాటు ఎక్స్‌ట్రా డాటా…

కొత్త సంవత్సరం వేళ టెలికాం కంపెనీలు వినియోగదారులపై వరాలు కురిపిస్తున్నాయి. ఎయిర్‌టెల్ తన యూజర్లకు ఎక్స్‌ట్రా 6 జీబీ డాటా ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా న్యూ ఇయర్ ఆఫర్‌ను ప్రకటించింది.

Vodafone Idea Offer: వోడాఫోన్ ఐడియా ఆఫర్ అదుర్స్... వన్ ఇయర్ ప్లాన్‌తో పాటు ఎక్స్‌ట్రా డాటా...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 31, 2020 | 11:02 PM

Share

కొత్త సంవత్సరం వేళ టెలికాం కంపెనీలు వినియోగదారులపై వరాలు కురిపిస్తున్నాయి. ఇప్పటికే జియో ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జీలు (ఐయూసీ) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌టెల్ చాలా రోజులుగా యూజర్లకు ఎక్స్‌ట్రా 6 జీబీ డాటా ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా న్యూ ఇయర్ ఆఫర్‌ను ప్రకటించింది. తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం వార్షిక రూ.1,499 ప్లాన్‌తో 50 జీబీ అదనపు డేటాను అందిస్తోంది. అయితే ఈ అదనపు డేటా అనేది ఎంపిక చేసిన సర్కిల్‌లలోని వినియోగదారులకు లభిస్తుంది అని సదరు టెలికాం కంపెనీ పేర్కొంది. ఈ డేటా తమకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవడానికి వోడాఫోన్ ఐడియా యూజర్లు వీఐ అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ ‌లో చూడాలని సూచించింది.

వోడాఫోన్ ఐడియా రూ.1,499 వార్షిక ప్రణాళిక సాధారణంగా 24జీబీ హై-స్పీడ్ డేటా మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు ఎంపిక చేసిన యూజర్లకు 50జీబీ డేటా కలుపుకొని మొత్తం 75జీబీ లభిస్తుంది. ఈ ప్లాన్ కింద అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్ లను పొందవచ్చు. అలాగే పాపులర్ వెబ్ సిరీస్, టీవీ షోలు, సినిమాలు, లైవ్ టీవీ ఛానళ్లకు ఉచిత యాక్సెస్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ మొత్తం 365 రోజులు పాటు చెల్లుబాటు అవుతుంది.

Also Read:

ED Against Amazon, Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు షాక్ ఇచ్చిన కేంద్రం.. చట్టాలను ఉల్లంఘించాయని..

మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ