Vodafone Idea: మళ్లీ సుప్రీం దారిపట్టిన వొడాఫోన్ ఐడియా.. ఏజీఆర్ బకాయిల విషయంలో పిటిషన్ దాఖలు
Vodafone Idea: వొడాఫోన్ ఐడియా మళ్లీ సుప్రీం కోర్టు మెట్లెక్కింది. ఏజీఆర్ బకాయిలను తిరిగి లెక్కించాలని కోరుతూ కోరుతూ పిటిషన్ వేసింది. లైసెన్స్ ఫీజును మాత్రమే పరిగణలోకి తీసుకుని

Vodafone Idea: వొడాఫోన్ ఐడియా మళ్లీ సుప్రీం కోర్టు మెట్లెక్కింది. ఏజీఆర్ బకాయిలను తిరిగి లెక్కించాలని కోరుతూ కోరుతూ పిటిషన్ వేసింది. లైసెన్స్ ఫీజును మాత్రమే పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే తమ ఏజీఆర్ బకాయి రూ. 28, 308 కోట్లు మాత్రమేనని, తమ ఆదాయాన్ని లెక్కించడంలో పొరపాటు జరిగినట్టు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. దీనివల్ల తాము అదనంగా దాదాపు రూ. 24,600 కోట్ల బకాయిలు నిర్ణయించినట్టు వొడాఫోన్ ఐడియా వివరించింది. ప్రస్తుతం తమ సంస్థ రూ. 58,254 కోట్లలో రూ. 7,854 కోట్ల బకాయిలను చెల్లించినట్టు స్పష్టం చేసింది. తమ ఏజీఆర్ బకాయిలను టెలికాం శాఖ సరిగా లెక్కించలేదని, దీనిపై సంస్థ స్పష్టత కోరినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఇదివరకు మరో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కూడా తమ ఏజీఆర్ బకాయిలను మళ్లీ లెక్కించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. మొత్తం ఏజీఆర్ బకాయిలు రూ. 43,980 కోట్లుగా ఉండగా, ఇప్పటికే రూ. 18,000 కోట్లను చెల్లించింది.
Vodafone Idea Offer: వోడాఫోన్ ఐడియా ఆఫర్ అదుర్స్… వన్ ఇయర్ ప్లాన్‌తో పాటు ఎక్స్‌ట్రా డాటా…
కేంద్రం నిధుల విడుదల… జీఎస్టీ బకాయిలు రాష్ట్రాలకు చెల్లింపు… 42 వేల కోట్ల అప్పులు చేసిన కేంద్రం…