Vodafone Idea Offer: వోడాఫోన్ ఐడియా ఆఫర్ అదుర్స్… వన్ ఇయర్ ప్లాన్‌తో పాటు ఎక్స్‌ట్రా డాటా…
కొత్త సంవత్సరం వేళ టెలికాం కంపెనీలు వినియోగదారులపై వరాలు కురిపిస్తున్నాయి. ఎయిర్‌టెల్ తన యూజర్లకు ఎక్స్‌ట్రా 6 జీబీ డాటా ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా న్యూ ఇయర్ ఆఫర్‌ను ప్రకటించింది.

కొత్త సంవత్సరం వేళ టెలికాం కంపెనీలు వినియోగదారులపై వరాలు కురిపిస్తున్నాయి. ఇప్పటికే జియో ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జీలు (ఐయూసీ) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌టెల్ చాలా రోజులుగా యూజర్లకు ఎక్స్‌ట్రా 6 జీబీ డాటా ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా న్యూ ఇయర్ ఆఫర్‌ను ప్రకటించింది. తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం వార్షిక రూ.1,499 ప్లాన్‌తో 50 జీబీ అదనపు డేటాను అందిస్తోంది. అయితే ఈ అదనపు డేటా అనేది ఎంపిక చేసిన సర్కిల్‌లలోని వినియోగదారులకు లభిస్తుంది అని సదరు టెలికాం కంపెనీ పేర్కొంది. ఈ డేటా తమకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవడానికి వోడాఫోన్ ఐడియా యూజర్లు వీఐ అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ లో చూడాలని సూచించింది.
వోడాఫోన్ ఐడియా రూ.1,499 వార్షిక ప్రణాళిక సాధారణంగా 24జీబీ హై-స్పీడ్ డేటా మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు ఎంపిక చేసిన యూజర్లకు 50జీబీ డేటా కలుపుకొని మొత్తం 75జీబీ లభిస్తుంది. ఈ ప్లాన్ కింద అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్ లను పొందవచ్చు. అలాగే పాపులర్ వెబ్ సిరీస్, టీవీ షోలు, సినిమాలు, లైవ్ టీవీ ఛానళ్లకు ఉచిత యాక్సెస్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ మొత్తం 365 రోజులు పాటు చెల్లుబాటు అవుతుంది.
Also Read: