AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రానా పెళ్లికి వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ

అతిథులను వేడుకకు ఆహ్వానించకుండా వారికి 'వర్చువల్ కిట్స్' పంపి.. పెళ్లిని ఇంటి నుంచే చూసేవిధంగా ఏర్పాటు చేస్తున్నారు. కరోనా నిబంధన నేపథ్యంలో అతి కొద్ది మంది అతిథులకే ఆహ్వానం అందిస్తున్నారు....

రానా పెళ్లికి వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ
Sanjay Kasula
|

Updated on: Aug 04, 2020 | 2:42 PM

Share

Virtual Reality Technology for Rana Wedding : టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి రానా పెళ్లికి సమయం ఆసన్నమైంది. ఓ ఇంటివాడు కాబోతున్నారు.  తన ప్రేయసి మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్లూ వేయనున్నారు. అయితే తాజాగా రానా పెళ్లికి సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ ఇప్పుడే వచ్చింది.

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రానా దగ్గుబాటి, చాలా రోజులుగా మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా ఉన్నారు. ఈ యంగ్ హీరో మే 12న వ్యాపారవేత్త మిహీకా బజాజ్‌తో ప్రేమలో ఉన్నట్టుగా ప్రకటించారు. ఆ వెంటనే పెళ్లి ఏర్పాట్లలో బిజీగా మారిపోయారు. ఇప్పటికే వీరిద్దరి రోకా వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా నిర్వహించగా, ఆగస్టు 8న పెళ్లి జరిపిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇప్పట్లో కరనా వ్యాప్తి చక్కబడే పరిస్థితి కనిపించకపోవటంతో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఐదు రోజుల పాటు వివాహ వేడుకను నిర్వహిస్తున్నారు. వీరి వివాహ వేడుకను వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా పెళ్లి వేడుకను జరపనున్నట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. అతిథులను వేడుకకు ఆహ్వానించకుండా వారికి ‘వర్చువల్ కిట్స్’ పంపి.. పెళ్లిని ఇంటి నుంచే చూసేవిధంగా ఏర్పాటు చేస్తున్నారు. కరోనా నిబంధన నేపథ్యంలో అతి కొద్ది మంది అతిథులకే ఆహ్వానం అందిస్తున్నారు.

అయితే ప్రస్తుతం కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో వివాహ వేడుకను ప్యాలెస్‌లో కాకుండా ఇంట్లోనే నిర్వహించాలని భావిస్తున్నారట. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తోంది.