AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్‌ గురించి కీలక విషయాలు వెల్లడించిన మాజీ ఫ్లాట్‌మేట్‌

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ కేసు మిస్టరీ సినిమాను తలపిస్తోంది. మొదట ఇది ఆత్మహత్య అనుకున్నప్పటికీ.. ఎవరో కుట్ర చేసి సుశాంత్‌ని హత్య చేశారన్న అనుమానాలు

సుశాంత్‌ గురించి కీలక విషయాలు వెల్లడించిన మాజీ ఫ్లాట్‌మేట్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 04, 2020 | 2:58 PM

Share

Sushant Singh former Flatmate Samuel: బాలీవుడ్ నటుడు సుశాంత్‌ కేసు మిస్టరీ సినిమాను తలపిస్తోంది. మొదట ఇది ఆత్మహత్య అనుకున్నప్పటికీ.. ఎవరో కుట్ర చేసి సుశాంత్‌ని హత్య చేశారన్న అనుమానాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇదిలా ఉంటే సుశాంత్‌ సన్నిహితులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆ నటుడి గురించి చెబుతున్నారు. కొందరేమో సుశాంత్ డిప్రెషన్‌తో బాధపడేవాడని అంటుండగా.. మరికొందరేమో సుశాంత్‌ అలా ఎప్పుడూ లేడని అంటున్నారు. ఈ క్రమంలో సుశాంత్‌ గురించి మాజీ ఫ్లాట్‌మేట్‌ శామ్యూల్‌ హావోకిప్‌ కీలక విషయాలు వెల్లడించారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శామ్యూల్‌.. తాను 2018 జూన్ నుంచి 2019 జూలై వరకు సుశాంత్‌తో ఉన్నానని వివరించారు. అంతేకాదు తాను సుశాంత్‌ పీఆర్వో టీమ్‌లో కూడా పనిచేశానని తెలిపారు. అయితే ఎల్‌ఎల్‌బీ పూర్తి కావడంతో సుశాంత్‌ టీమ్ నుంచి తాను బయటకు వచ్చినట్లు శామ్యూల్‌ పేర్కొన్నారు. ఇక సుశాంత్‌ డిప్రెషన్‌, బైపాల్‌ డిజార్డర్‌తో బాధపడేవాడా..? అన్న ప్రశ్నకు సుశాంత్‌ చాలా ప్రేమించే మనసున్న వ్యక్తి అని వెల్లడించారు. అంతేకాదు రియా తనకంటే సిద్ధార్థ్‌ పితానీతో క్లోజ్‌గా ఉండేదని శామ్యూల్‌ తెలిపారు.

ఇక సుశాంత్‌ మరణించిన రోజు తాను ఆయన స్నేహితులు, ఇంట్లో వారికి ఫోన్ చేస్తే ఎవరూ కాల్ లిఫ్ట్ చేయలేదని అన్నారు. సిద్ధార్థ్ పితానీకి ఫోన్ చేసినా ఫలితం లేకపోయిందని, అయితే ఏం జరిగిందన్న విషయాన్ని అతడు మెసేజ్‌లో తెలిపాడని శామ్యూల్ పేర్కొన్నారు. ”ఆ రోజు సుశాంత్‌ ఇంటి హెల్పర్‌ నీరజ్ మాత్రమే నా ఫోన్‌ని లిఫ్ట్ చేశాడు. అతడు కూడా మీడియాలో వచ్చిందే  నాకు చెప్పాడు” అని శామ్యూల్ తెలిపారు. ఇక సుశాంత్‌ క్లోజ్ ఫ్రెండ్‌గా చెప్పుకునే సందీప్‌‌ ఎస్‌ సింగ్‌ ఎవరో తనకు తెలీదని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Read This Story Also: పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు.. జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

Follow Us
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?