వావ్ ! ఖరీదైన కారును ఎలా కాల్చేశాడో ! వీడియో చూడాల్సిందే !

రష్యాలో ఓ యూట్యూ బర్ కి  తన ఖరీదైన మెర్సిడెస్ కారంటే విపరీతమైన కోపమొచ్చింది. . 2.4 కోట్ల రూపాయల లగ్జరీ కారును ఇష్టంగా కొనడమైతే కొన్నాడు గానీ..అది అతనికి తెచ్చిన కష్టాలు మాత్రం ఇన్నీఅన్నీ కావు.. మాటిమాటికీ అది రిపేర్లకు వెళ్లడంతో అతడిలో సహనం నశించింది.  కారును ఏ డీలర్ వద్ద కొన్నాడో గానీ అతగాడు  కూడా ఈ వాహనానికి మరమ్మతులు చేయలేక చేతులెత్తేశాడు.  మన యూట్యూబర్ గారి ఫోన్ కాల్స్ కు స్పందించడం మానేశాడు. […]

వావ్ ! ఖరీదైన కారును ఎలా కాల్చేశాడో ! వీడియో చూడాల్సిందే !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 28, 2020 | 3:41 PM

రష్యాలో ఓ యూట్యూ బర్ కి  తన ఖరీదైన మెర్సిడెస్ కారంటే విపరీతమైన కోపమొచ్చింది. . 2.4 కోట్ల రూపాయల లగ్జరీ కారును ఇష్టంగా కొనడమైతే కొన్నాడు గానీ..అది అతనికి తెచ్చిన కష్టాలు మాత్రం ఇన్నీఅన్నీ కావు.. మాటిమాటికీ అది రిపేర్లకు వెళ్లడంతో అతడిలో సహనం నశించింది.  కారును ఏ డీలర్ వద్ద కొన్నాడో గానీ అతగాడు  కూడా ఈ వాహనానికి మరమ్మతులు చేయలేక చేతులెత్తేశాడు.  మన యూట్యూబర్ గారి ఫోన్ కాల్స్ కు స్పందించడం మానేశాడు. ఇక మనోడు భరించలేక ఈ మెర్సిడెస్ ను నిర్మానుష్యమైన పొలం వద్దకు తీసుకువెళ్లి దానికి అగ్గి రాజేశాడు. అది మంటల్లో మండుతుంటే  తాపీగా బ్రెడ్డు ముక్క నములుతూ ఎంజాయ్ చేశాడు.  ఆయనగారు తన వాహనాన్ని కాల్చిన విధంబెట్టిదనిన.. ఈ వీడియో చూడాల్సిందే ! అన్నట్టు ఇతని పేరు మైఖేల్ లిట్ విన్ అట !

Latest Articles