రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. మేనకోడలు ఎంగేజ్మెంట్ కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని కొత్తపేట గ్రామానికి చెందిన ఆనంద్ దంపతులు హైదరాబాదులో మేస్త్రీ పని చేస్తూ జీవిస్తున్నారు. కాగా, ఆనంద్ మేనకోడలు నిశ్చితార్థం కోసం వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి భార్యభర్తలిద్దరు బైక్ పై బయలుదేరారు. అతి వేగంగా వచ్చి కారు వారి బైక్ ను వెనక నుంచి […]

వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. మేనకోడలు ఎంగేజ్మెంట్ కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని కొత్తపేట గ్రామానికి చెందిన ఆనంద్ దంపతులు హైదరాబాదులో మేస్త్రీ పని చేస్తూ జీవిస్తున్నారు. కాగా, ఆనంద్ మేనకోడలు నిశ్చితార్థం కోసం వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి భార్యభర్తలిద్దరు బైక్ పై బయలుదేరారు. అతి వేగంగా వచ్చి కారు వారి బైక్ ను వెనక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టారు.