జగన్‌కు లేడీ అమితాబ్ కితాబు.. ఎందుకంటే?

ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రచార సారథి విజయశాంతి.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. మహిళల రక్షణ దిశగా జగన్ తీసుకుంటున్న చర్యలను విజయశాంతి అభినందించారు. ఈ మేరకు విజయశాంతి ఓ ప్రకటన విడుదల చేశారు. దిశ అత్యాచారం, హత్యోదంతం యావత్ దేశాన్ని కలిచి వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేవలం వారం రోజుల్లోనే నేరస్థులను ఎన్‌కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులపై తొలుత అభినందనలు వెల్లువెత్తగా.. ఆ తర్వాత […]

జగన్‌కు లేడీ అమితాబ్ కితాబు.. ఎందుకంటే?
Follow us
Rajesh Sharma

| Edited By: Srinu

Updated on: Dec 10, 2019 | 1:00 PM

ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రచార సారథి విజయశాంతి.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. మహిళల రక్షణ దిశగా జగన్ తీసుకుంటున్న చర్యలను విజయశాంతి అభినందించారు. ఈ మేరకు విజయశాంతి ఓ ప్రకటన విడుదల చేశారు.

దిశ అత్యాచారం, హత్యోదంతం యావత్ దేశాన్ని కలిచి వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేవలం వారం రోజుల్లోనే నేరస్థులను ఎన్‌కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులపై తొలుత అభినందనలు వెల్లువెత్తగా.. ఆ తర్వాత పోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇదంతా ఓ వైపు జరుగుతుంటే.. ఏపీ సర్కార్ మహిళలపై నేరాల సంఖ్య తగ్గించేందుకు ఓ నిర్ణయం తీసుకుంది.

ఇప్పుడు ఈ నిర్ణయమే జగన్‌పై విజయశాంతి ప్రశంసలు కురిపించడానికి కారణమైంది. దిశ ఉదంతం నేపథ్యంలో ఏపీలో వ్యక్తమైన అభిప్రాయాలకు అనుగుణంగా మహిళపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని వీలైనంత త్వరగా శిక్షించేందుకు జగన్ ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసేందుకు తలపెట్టింది.

చట్టంలో మార్పులు చేసే ప్రక్రియ ఆల్‌రెడీ ప్రారంభం కాగా.. శీతాకాల సమావేశాలలోనే సవరించిన చట్టాన్ని అసెంబ్లీ ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని విజయశాంతి అభినందించారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.