పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నియామకం.. విజయసాయి రెడ్డికి కీలక పదవి..

పార్లమెంటరీ స్థాయి సంఘాలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. వివిధ శాఖలకు ఛైర్మన్లు, సభ్యులను నియమించినట్లు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కూడా ఛైర్మన్‌ పదవులు దక్కాయి. కాగా, ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కీలక పదవి దక్కింది. వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా విజయసాయిరెడ్డిని నియమించారు. ఈ కమిటీలో మాగుంట శ్రీనివాసులురెడ్డి, నామా, కేశినేని నానిని సభ్యులుగా ఉన్నారు. ఇక పరిశ్రమల వ్యవహారాల పార్లమెంటరీ […]

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నియామకం.. విజయసాయి రెడ్డికి కీలక పదవి..
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 11:24 AM

పార్లమెంటరీ స్థాయి సంఘాలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. వివిధ శాఖలకు ఛైర్మన్లు, సభ్యులను నియమించినట్లు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కూడా ఛైర్మన్‌ పదవులు దక్కాయి. కాగా, ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కీలక పదవి దక్కింది. వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా విజయసాయిరెడ్డిని నియమించారు. ఈ కమిటీలో మాగుంట శ్రీనివాసులురెడ్డి, నామా, కేశినేని నానిని సభ్యులుగా ఉన్నారు. ఇక పరిశ్రమల వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎంపీ కేశవరావును నియమించారు. పరిశ్రమల వ్యవహారాల పార్లమెంటరీ సభ్యుడిగా అవినాష్ రెడ్డిని నియమిస్తున్నట్లు ఓం బిర్లా తెలిపారు. ఇదిలా ఉంటే.. రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖల స్థాయి సంఘం చైర్మన్‌గా టీజీ, పార్లమెంట్ వ్యవహారాల ఆర్థికశాఖ సభ్యులుగా మిథున్‌రెడ్డి, సీఎం రమేష్‌ను నియమిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఢిల్లీలో కీలక పదవులు వరించడం విశేషం.

ఇక పెట్రోలియం స్థాయి సంఘం ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ రమేశ్ బిధురి, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ స్థాయి సంఘానికి ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ను నియమించారు. హోం వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ, రక్షణ వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా బీజేపీ నేత జోయల్‌ ఓరం, విదేశీ వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా బీజేపీ సీనియర్‌ నేత పి.పి చౌదరి, అందులో సభ్యుడిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం నియమితులయ్యారు. గతంలో చిదంబరం హోం వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా వ్యవహరించారు. రైల్వే వ్యవహారాల స్థాయి సంఘానికి రాధామోహన్‌ సింగ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఎరువులు, రసాయనాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా డీఎంకే ఎంపీ కనిమొళి నియమితులయ్యారు. స్థాయి సంఘంలో కాంగ్రెస్ నేతలు రాహుల్‌ గాంధీ, అభిషేక్‌ మనుసింఘ్వి సభ్యులుగా ఉన్నారు.

Latest Articles
ఉప్పు తక్కువగా తింటున్నారా..? మీరు డేంజర్‌లో ఉన్నట్టే.. జాగ్రత్త!
ఉప్పు తక్కువగా తింటున్నారా..? మీరు డేంజర్‌లో ఉన్నట్టే.. జాగ్రత్త!
జాతకంలో శని దోషం తొలగాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని ఇలా పూజించండి..
జాతకంలో శని దోషం తొలగాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని ఇలా పూజించండి..
భారతదేశంలో అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్‌ ఏదో తెలుసా?
భారతదేశంలో అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్‌ ఏదో తెలుసా?
బ్యాచ్‌ల వారీగా USAకు భారత క్రికెట్ జట్టు.. మొదటి వెళ్లేది వీరే
బ్యాచ్‌ల వారీగా USAకు భారత క్రికెట్ జట్టు.. మొదటి వెళ్లేది వీరే
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వాముతో అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వాముతో అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..