ఇల్లు సరే ! పెళ్లెప్పుడు ? విజయ్ కి నెటిజన్ల ‘పోరు ‘
అర్జున్ రెడ్డి హిట్ తరువాత విజయ్ దేవరకొండకి పెరిగిపోయిన క్రేజ్ అంతా ఇంతా కాదు.. ప్రొఫెషనల్ గానే కాదు ఇటు పర్సనల్ గా కూడా చాలా బిజీ అయిపోయాడు ఈ యంగ్ హీరో.. మొన్నటికి మొన్న రౌడీ వేర్ పేరుతో తన ఓన్ క్లాతింగ్ బ్రాండ్ ని లాంచ్ చేసాడు.. ఇక రీసెంట్ గా మీకు మాత్రమే చెబుతానంటూ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు.. ఇప్పుడు ఈ హీరో ఓ ఇంటివాడు కూడా అయ్యాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఫిల్మ్ […]
అర్జున్ రెడ్డి హిట్ తరువాత విజయ్ దేవరకొండకి పెరిగిపోయిన క్రేజ్ అంతా ఇంతా కాదు.. ప్రొఫెషనల్ గానే కాదు ఇటు పర్సనల్ గా కూడా చాలా బిజీ అయిపోయాడు ఈ యంగ్ హీరో.. మొన్నటికి మొన్న రౌడీ వేర్ పేరుతో తన ఓన్ క్లాతింగ్ బ్రాండ్ ని లాంచ్ చేసాడు.. ఇక రీసెంట్ గా మీకు మాత్రమే చెబుతానంటూ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు.. ఇప్పుడు ఈ హీరో ఓ ఇంటివాడు కూడా అయ్యాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి..
ఫిల్మ్ నగర్ లో ఓ పెద్ద ఇంటిని, భారీ మొత్తం చెల్లించి విజయ్ కొనుగోలు చేసాడట.. హీరో శ్రీకాంత్ ఇంటి సమీపంలో ఈ కొత్త ఇల్లు ఉన్నట్టు తెలుస్తోంది. రెండురోజుల క్రితమే ఆ ఇంటి గృహప్రవేశం కూడా జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఇక మూవీస్ గురించి మాట్లాడుకుంటే విజయ్.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో ఫిబ్రవరి 14న జనం ముందుకి రాబోతున్నాడు, అలాగే పూరీ డైరెక్షన్లో వస్తున్న మరో మూవీతో బిజీగా ఉన్నాడు. మొత్తానికి సినిమాలు, వ్యాపారాలు, ఇల్లు అన్నీ అయిపోయాయి.. ఇక పెళ్లెప్పుడు అని అడిగేస్తున్నారు నెటిజన్లు.