ఏడాదికి రూ.12.. బీమా రూ.2 లక్షలు.. ఈ కేంద్ర పథకం గురించి తెలుసా..?

పీఎంఎస్‌బీవై.. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన్.. ఈ పథకం సామాజిక సురక్షలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం.. మే 8వ తేదీ 2016లో ప్రవేశపెట్టింది. ఇది ఒక ప్రమాద బీమా పథకం. దీని ద్వారా యాక్సిడెంటల్‌గా జరిగే మరణాలకు, అంగవైకల్యానికి కేంద్ర ప్రభుత్వం బీమా కల్పిస్తుంది. దీని వ్యవధి ఏడాది మాత్రమే. అయితే దీనిని ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ పథకం సామాన్య ప్రజానీకానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ స్కీం విశేషాలు […]

ఏడాదికి రూ.12.. బీమా రూ.2 లక్షలు.. ఈ కేంద్ర పథకం గురించి తెలుసా..?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 5:17 PM

పీఎంఎస్‌బీవై.. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన్.. ఈ పథకం సామాజిక సురక్షలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం.. మే 8వ తేదీ 2016లో ప్రవేశపెట్టింది. ఇది ఒక ప్రమాద బీమా పథకం. దీని ద్వారా యాక్సిడెంటల్‌గా జరిగే మరణాలకు, అంగవైకల్యానికి కేంద్ర ప్రభుత్వం బీమా కల్పిస్తుంది. దీని వ్యవధి ఏడాది మాత్రమే. అయితే దీనిని ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ పథకం సామాన్య ప్రజానీకానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ స్కీం విశేషాలు ఎంటి.. దీనిని ఎలా అప్లై చేయాలి.. ఎవరు అర్హులు అన్నదాని గురించి తెలుసుకోండి.

పీఎంఎస్‌బీవై పథకం వివరాలు..

* ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన్.. ఇది ఒక ప్రమాద బీమా పథకం * 18 నుంచి 70ఏళ్ళ వయస్సు మధ్య వారు ఈ పథకానికి అర్హులు * ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం.. ఏడాదికి రూ.12 మాత్రమే * కేవైసీ గుర్తింపుగా ఆధార్ కార్డు ఉంటే చాలు.. * బ్యాంకులో ఖాతా కల్గి ఉన్న వారు ఈ బీమా సులువుగా చేసుకోవచ్చు * బ్యాంకు ఖాతా లేని వారు ఎల్‌ఐసీ ద్వారా కూడా అప్లై చేయవచ్చు * ప్రతి ఏటా మే 31వ తేదీ నుంచి ఈ ఇన్సూరెన్స్ గడువు ప్రారంభమవుతుంది. * సదరు బీమా దారు యాక్సిడెంట్‌లో మరణిస్తే రూ.2లక్షల ఇన్సూరెన్స్.. నామినీకి అందజేయబడుతుంది. * ప్రమాదంలో అంగవైకల్యం కల్గితే.. రూ.1లక్ష వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. * ఈ పథకంలో ఎన్ఆర్ఐలు కూడా చేరవచ్చు. (అయితే వీరికి భారత కరెన్సీలో మాత్రమే ఇన్సూరెన్స్ చెల్లిస్తుంది.) * జన్‌ధన్ అకౌంట్లు కల్గి ఉన్నవారు.. ఈ బీమా పథకంలో చేరడం చాలా ఈజీ * బీమా చేయించుకోవాలనుకుంటున్న వాళ్లు.. బ్యాంకు మిత్రను కలిస్తే.. పూర్తి వివరాలు తెలియజేస్తారు. * ఒక వ్యక్తికి ఎన్ని అకౌంట్లు ఉన్నా.. ఒక అకౌంట్ నుంచి మాత్రమే బీమా వర్తిస్తుంది

బీమా క్లెయిమ్ చేసుకోవడం ఎలా..

బీమా పాలసీదారు అకాల మరణం చెందితే.. లేదా అంగవైకల్యంగా మారితే.. ఇన్సూరెన్స్ పొందటానికి తగిన పత్రాలను జమచేయాలి. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి, ఆస్పత్రి నుంచి పత్రాలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన వివరాలు ఆస్పత్రి రికార్డుల ద్వారా ధృవీకరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వెంటనే ఇన్సూరెన్స్ చేసిన బ్యాంకును గానీ.. లేదా బ్యాంకు మిత్రను కలిసి.. పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. పీఎంఎస్‌బీవైలో చేరేటప్పుడు నామినీగా ఎవరిని సూచిస్తారో.. వారే బీమాను క్లెయిం చేసుకోవచ్చు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో