ఆ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్తున్నా..ఫ్యాన్స్‌కు ట్వీట్ చేసిన విజయ్ దేవరకొండ
థియేటర్ల రీ ఓపెనింగ్‌పై విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. తన గ్యాంగ్‌తో కలిసి సినిమా చూసేందుకు వెళ్తున్నా అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. 'సోలో బ్రతుకే సో బెటర్' మూవీ టీంను విజయ్ దేవరకొండ విష్..

Vijay Devarakonda Tweet : థియేటర్ల రీ ఓపెనింగ్‌పై విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. తన గ్యాంగ్‌తో కలిసి సినిమా చూసేందుకు వెళ్తున్నా అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ టీంను విజయ్ దేవరకొండ విష్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ అవుతున్న సోలో బ్రతుకే సో బెటర్ విజయాన్ని అందుకోవాలని అన్నారు. ఇన్‌స్టాలో పది మిలియన్ల ఫాలోవర్స్ మార్క్‌ను అందుకున్న విజయ్ దేవరకొండ.. ఈ ఫీట్ సాధించిన తొలి సౌత్ ఇండియన్ యాక్టర్‌గా సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.
Finalllyyyyyy!!! ???
Theaters are back back back :)) wide open now! Getting my gang ready for a boys day out at the cinemasss :))
And Wishing @IamSaiDharamTej super duper luck for #SBSB release tomorrow, may you bring lots of smiles and laughter to everyone, much needed!
— Vijay Deverakonda (@TheDeverakonda) December 24, 2020
సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల ఓపెనింగ్‌కు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మంగళవారం నుంచే సినిమాలు నడిపించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా ఆంక్షలను తప్పని సరిగా పాటించాలని కోరింది.




