దర్శకుడు వివి వినాయక్‌‌కు ఝలక్

దర్శకుడు వివి వినాయక్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు షాకిచ్చారు. హైదరాబాద్ నగర శివారులోని అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ నేపథ్యంలో వట్టినాగులపల్లిలో ఆయన నిర్మించుకుంటున్న భవనాన్ని అనుమతి లేదంటూ అధికారులు కూల్చివేశారు. 111 జీవోకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని వివి. వినాయక్‌కు అధికారులు నోటిసులు జారీ చేశారు. ముందుగానే నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో మరిన్ని అక్రమ నిర్మాణాలున్నట్టు తేల్చిన […]

దర్శకుడు వివి వినాయక్‌‌కు ఝలక్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jun 27, 2019 | 8:17 PM

దర్శకుడు వివి వినాయక్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు షాకిచ్చారు. హైదరాబాద్ నగర శివారులోని అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ నేపథ్యంలో వట్టినాగులపల్లిలో ఆయన నిర్మించుకుంటున్న భవనాన్ని అనుమతి లేదంటూ అధికారులు కూల్చివేశారు. 111 జీవోకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని వివి. వినాయక్‌కు అధికారులు నోటిసులు జారీ చేశారు. ముందుగానే నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో మరిన్ని అక్రమ నిర్మాణాలున్నట్టు తేల్చిన మున్సిపల్‌ అధికారులు వాటిని కూడా కూల్చివేయనున్నారు.