AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రాగెన్ కంట్రీకి మరో షాకిచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..చైనా కంపెనీలను డిలీట్‌ చేసే చట్టంపై సంతకం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తన సంతకంతో చైనా కంపెనీల్లో వణికిపుట్టించాడు. దీంతో అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం నానాటికీ ముదురుతున్నట్లు కన్పిస్తోంది. ఇప్పటికే చైనాకు చెందిన పలు కంపెనీలపై అమెరికా..

డ్రాగెన్ కంట్రీకి మరో షాకిచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..చైనా కంపెనీలను డిలీట్‌ చేసే చట్టంపై సంతకం
Sanjay Kasula
| Edited By: |

Updated on: Dec 20, 2020 | 12:11 AM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తన సంతకంతో చైనా కంపెనీల్లో వణికిపుట్టించాడు. దీంతో అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం నానాటికీ ముదురుతున్నట్లు కన్పిస్తోంది. ఇప్పటికే చైనాకు చెందిన పలు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించగా.. తాజాగా అగ్రరాజ్యం స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి చైనా కంపెనీలను డిలీట్‌ చేసే చట్టంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు.

హోల్డింగ్‌ ఫారిన్‌ కంపెనీస్‌ అకౌంటబుల్‌ యాక్ట్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టంతో.. చైనా కంపెనీలు అమెరికా అమెరికా సెక్యూరిటీస్‌ చట్టాలను పాటించడంలో విఫలమైతే గనుక వాటిని స్టాక్‌ మార్కెట్ల నుంచి డీలిస్ట్‌ చేయొచ్చు.

ఈ బిల్లు ప్రకారం లిస్టెడ్‌ విదేశీ కంపెనీలు తమపై తమ దేశ నియంత్రణేమీ లేదంటూ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేగాక, అమెరికాలో పబ్లిక్‌ కంపెనీల ఖాతాలు సమీక్షించే బోర్డు తమ ఖాతాలను కూడా తనిఖీ చేసేందుకు అంగీకరించాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రధానంగా విదేశీ కంపెనీలన్నింటికీ వర్తిస్తుంది.

అయితే ఆడిటింగ్‌ విషయంలో చైనా కంపెనీలు అమెరికాతో సహకరించకపోవడంతో యూఎస్‌ కఠినచర్యలు తీసుకొచ్చింది. తాజా చట్టం.. దిగ్గజ కంపెనీలైన అలీబాబా గ్రూప్‌, బైడు తదితర వాటిపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశముంది. ఈ ఏడాది మేలో ఈ బిల్లుకు సెనేట్‌ ఆమోదించగా.. తాజాగా ట్రంప్‌ సంతకం చేశారు.

Follow Us
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..