న్యూజెర్సీలో కాల్పులు.. ఆరుగురి మృతి.. గంటలపాటు ఉద్రిక్తత

అమెరికాలోని న్యూజెర్సీ నగరం మంగళవారం కాల్పులతో దద్దరిల్లింది. ఇద్దరు దుండగులు సుమారు గంట సేపు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. యూదుల (జెవిష్) గ్రాసరీ స్టోర్ (మాల్) ని లక్ష్యంగా చేసుకుని వారు కాల్పులు జరపగా.. వారిపై పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి, ఇద్దరు అనుమానితులతో సహా ఆరుగురు మరణించారు. నగరంలోని బే వ్యూ సిమెటరీ వద్ద ఈ కాల్పుల మోత ప్రారంభమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా.. దుండగులు […]

న్యూజెర్సీలో కాల్పులు.. ఆరుగురి మృతి.. గంటలపాటు ఉద్రిక్తత
Follow us
Anil kumar poka

| Edited By:

Updated on: Dec 11, 2019 | 12:38 PM

అమెరికాలోని న్యూజెర్సీ నగరం మంగళవారం కాల్పులతో దద్దరిల్లింది. ఇద్దరు దుండగులు సుమారు గంట సేపు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. యూదుల (జెవిష్) గ్రాసరీ స్టోర్ (మాల్) ని లక్ష్యంగా చేసుకుని వారు కాల్పులు జరపగా.. వారిపై పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి, ఇద్దరు అనుమానితులతో సహా ఆరుగురు మరణించారు. నగరంలోని బే వ్యూ సిమెటరీ వద్ద ఈ కాల్పుల మోత ప్రారంభమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా.. దుండగులు జరిపిన ఫైరింగ్ లో సిటీ పోలీస్ డిటెక్టివ్ చీఫ్ 39 ఏళ్ళ జోసెఫ్ ‘ జో ‘ సీల్స్ ప్రాణాలు కోల్పోయాడు. నల్లని దుస్తులు ధరించిన క్రిమినల్స్ అత్యంత అధునాతన రైఫిళ్ళతో కాల్పులు జరిపినట్టు తెలిసింది.

డిటెక్టివ్ జోసెఫ్ సీల్స్ ఇటీవలే క్రైమ్ విభాగానికి ప్రమోషన్ పై బదిలీ అయ్యాడని, అక్రమ ఆయుధాల ఆచూకీని కనుగొని, దుండగులను పట్టుకునే బాధ్యతలు నెరవేర్చేవాడని పోలీసులు తెలిపారు. న్యూజెర్సీలో జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసు అధికారులు స్వల్పంగా గాయపడ్డారు. ఒక దశలో క్రిమినల్స్ ఆ స్టోర్‌లో దాక్కున్నారని, వారిని వెలుపలికి తీసుకువచ్చేందుకు పోలీసులు చాలాసేపు కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిసింది. ఈ ఘటనతో భయభ్రాంతులైన ప్రజలు పరుగులు తీశారు. ఆ పరిసర ప్రాంతాల్లోని షాపులు, స్కూళ్ళను మూసివేశారు.