గ్రాండ్‌గా మ్యారేజ్‌..డ్యాన్సర్‌పై ఫైరింగ్‌

గ్రాండ్‌గా మ్యారేజ్‌..డ్యాన్సర్‌పై ఫైరింగ్‌

అక్కడ గ్రాండ్‌గా పెళ్లి జరుగుతోంది. ఆ వేడుకలో ఏర్పాటుచేసిన డ్యాన్స్‌ షో చూస్తూ ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అంతలోనే ఒక్కసారిగా తుపాకీ మోత. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే స్టేజ్‌పై ఓ డ్యాన్సర్‌ ముఖానికి బులెట్‌ గాయంతో  కుప్పకూలిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఈ నెల 1న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తిక్రీ గ్రామంలోని ఓ గ్రామ పెద్ద కుమార్తె వివాహంలో ఈ ఘటన జరిగింది. డ్యాన్స్‌ చేస్తూ మధ్యలో ఆపినందుకు ఆ యువతిని తుపాకీతో కాల్చిపడేశాడు […]

Pardhasaradhi Peri

|

Dec 06, 2019 | 6:56 PM

అక్కడ గ్రాండ్‌గా పెళ్లి జరుగుతోంది. ఆ వేడుకలో ఏర్పాటుచేసిన డ్యాన్స్‌ షో చూస్తూ ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అంతలోనే ఒక్కసారిగా తుపాకీ మోత. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే స్టేజ్‌పై ఓ డ్యాన్సర్‌ ముఖానికి బులెట్‌ గాయంతో  కుప్పకూలిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఈ నెల 1న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

తిక్రీ గ్రామంలోని ఓ గ్రామ పెద్ద కుమార్తె వివాహంలో ఈ ఘటన జరిగింది. డ్యాన్స్‌ చేస్తూ మధ్యలో ఆపినందుకు ఆ యువతిని తుపాకీతో కాల్చిపడేశాడు ఓ వ్యక్తి.  దీంతో అందరూ చూస్తుండగానే ఆమె స్టేజిపైనే కుప్పకూలిపోయింది. రక్తమోడుతున్న ఆమెను వెంటనే లక్నోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. డ్యాన్సర్‌ను తుపాకితో కాలుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐతే ఆమెపై కాల్పులు జరిపిన వ్యక్తిని ఆ గ్రామ పెద్ద బంధువుగా గుర్తించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu