దిశ కేసు.. నిందితుల ఎన్ కౌంటర్ నిజమేనా ?

దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం వాస్తవంగా జరిగిందేనా ? ఖాకీలు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే వారి వాదనను చట్ట నిబంధనల ప్రకారం అంగీకరించడం కష్టసాధ్యమేనన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. ఒక వ్యాసకర్త విశ్లేషణ ప్రకారం.. నిందితుల శరీరాల కింది భాగాల్లో పోలీసులు కాల్పులు జరిపివుంటే వారు అక్కడికక్కడే మరణించి ఉండేవారు కాదన్నదే.. సీన్ ఆఫ్ అఫెన్స్ (స్పాట్) వద్దకు పోలీసులు ఈ నిందితులను తీసుకువెళ్లారు. కస్టడీలో ఉన్న వీరు పారిపోవడానికి యత్నిస్తూ పోలీసులపై […]

దిశ కేసు.. నిందితుల ఎన్ కౌంటర్ నిజమేనా ?
Follow us

|

Updated on: Dec 06, 2019 | 8:36 PM

దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం వాస్తవంగా జరిగిందేనా ? ఖాకీలు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే వారి వాదనను చట్ట నిబంధనల ప్రకారం అంగీకరించడం కష్టసాధ్యమేనన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. ఒక వ్యాసకర్త విశ్లేషణ ప్రకారం.. నిందితుల శరీరాల కింది భాగాల్లో పోలీసులు కాల్పులు జరిపివుంటే వారు అక్కడికక్కడే మరణించి ఉండేవారు కాదన్నదే.. సీన్ ఆఫ్ అఫెన్స్ (స్పాట్) వద్దకు పోలీసులు ఈ నిందితులను తీసుకువెళ్లారు. కస్టడీలో ఉన్న వీరు పారిపోవడానికి యత్నిస్తూ పోలీసులపై దాడి చేశారు. . అయితే ఈ థియరీని నమ్మజాలమన్నది ఆయన అభిప్రాయం. జైలు నుంచో, లాకప్ నుంచో నిందితులను బయటకు తీసుకువఛ్చినప్పుడు వారి చేతులకు బేడీలు ఉంటాయి. అలాగే వారివెంట పోలీసు గార్డులు కూడా ఉంటారు. ఘోరమైన నేరం జరిగిన ప్రదేశానికి తగినన్ని ఆయుధాలు లేకుండా పోలీసులు వెళ్ళడానికి అవకాశం లేదు. నిందితుల వెంట ఎస్కార్టుగా ఎక్కువమంది సిబ్బందే ఉంటారు. నిందితుల దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉండే ఛాన్స్ కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఖాకీలపై దాడి చేసే అవకాశం కూడా లేదు.. ఒకవేళ వారు పారిపోవడానికి యత్నిస్తే.. ఎస్కార్టుగా ఉన్న పోలీసులు వారిపై గన్స్ తో కాల్పులు జరపవచ్చు. అయితే అది కూడా వారి శరీరాల కింది భాగాలపైనే.. అలా చేసిన పక్షంలో వారు గాయపడి కింద పడిపోతారు. అంతే తప్ప వారిని హతమార్చాలన్న ఉద్దేశం ఉండదు. అసలు ఈ కేసులో ఈ నలుగురి శరీరాల కిందిభాగాలపై బుల్లెట్ గాయాలు ఉన్నాయా అన్న విషయం ఎవరికీ తెలియదు. నిజంగా ఆ చోట్ల గాయాలై ఉంటే అప్పటికప్పుడే వారు ఎలా చనిపోతారన్నది ప్రశ్న.. అలాంటపుడు ఇది ‘ జెన్యూన్ ‘ ఎన్ కౌంటర్ అన్న పోలీసుల వాదనను నమ్మజాలం.. ఏమైనా దిశ ఉదంతం యావత్ దేశాన్నీ కుదిపివేసింది. పార్లమెంటులో దీనిపై పెద్ద చర్చే జరిగింది. నిందితులను అందరి సమక్షంలో కొట్టి చంపాలనో , ఉరి తీయాలనో డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ బహిరంగంగా కొట్టిచంపడం (మూక దాడి అందామా?) చట్ట ప్రకారం అనుమతించదగినదే అయితే ఇది ‘ భారీ ఎత్తున ‘ అధికారాల దుర్వినియోగానికి దారి తీస్తుంది. ‘ రూల్ ఆఫ్ లా ‘ అథారిటీకే ‘ దెబ్బ ‘ వాటిల్లినట్టు లెక్క. క్రిమినల్ జస్టిస్ ఎంత నెమ్మదిగా సాగుతోందంటే కరడు గట్టిన నేరస్థులకు కూడా దశాబ్దాల తరబడి ఉరిశిక్షల వంటివి అమలు జరగడం లేదు. ఈ కారణంగా ఇలాంటి నేరగాళ్లకు చట్టమంటే భయం లేకుండా పోయింది. పైగా చట్టం మీద బాధితులు, సామాన్య జనాలు కూడా నమ్మకం కోల్పోయారు. ఈ దేశంలో దురదృష్టవశాత్తూ రాజ్యాంగంలోని 21 వ అధికరణాన్ని చిన్నచూపు చూస్తున్నారు. నిందితులను బెయిలుపై విడుదల చేస్తే వారు సాక్షులను బెదిరిస్తారట.. తాజా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కేసు గురించి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.. ఆయన పవర్ ఫుల్ లీడర్ గనుక సాక్షులను ప్రభావితం చేస్తాడని ఈడీ, సీబీఐ భావించిన కారణంగా వంద రోజులకు పైగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇతర దేశాల్లో ఇలా జరగదు. బెయిలుపై విడుదలయ్యే వ్యక్తి సాక్షులను బెదిరించడం ద్వారా తన స్వేఛ్చను దుర్వినియోగం చేస్తాడన్న ఆందోళన ఆ దేశాల్లో తలెత్తదు. అంటే మన ‘ విత్ నెస్ ప్రొటెక్షన్ ‘ అన్నది విఫలమైనట్టే. ప్రస్తుతం దిశ కేసులో తక్షణ న్యాయం జరిగిందని సమాజంలోని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఎన్ కౌంటర్లు ఫేక్ అయినా, స్టేజీ మేనెజ్డ్ అయినా మన వ్యవస్థ ఇమేజీని మెరుగుపరచదు. ప్రతి పోలీసు ఎన్ కౌంటర్ కూ మేజిస్టీరియల్ విచారణ అవసరమని ఈ వ్యాసకర్త భావిస్తున్నారు. అలాగే డ్యూటీలో ఉన్న పోలీసులకూడా భద్రత అవసరం. ఐ పీ సి లోని 100 సెక్షన్ ప్రకారం ఆత్మరక్షణ హక్కు అన్నదాన్ని కొన్ని కేసుల్లో మరణ కారణాలకు కూడా వర్తింపజేయాలన్నది ఈయన మనోగతం..

వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: మంత్రి తుమ్మల
వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ