ఏపీలో అల్ట్రాటెక్ సిమెంట్ ప్రాజెక్ట్..900 మందికి ఉద్యోగాలు

భారతదేశంలోని మంచి నాణ్యత గల ఉత్పత్తిగా పేరొందిన అల్ట్రాటెక్ సిమెంట్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌లో రూ.2వేల 500కోట్ల భారీ ప్రాజెక్టు చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వడంతో కర్నూలు జిల్లాలోని పెట్నికొటె గ్రామంలో ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు. ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంటును ఏర్పాటు చేసి 900 మందికు పైగా ఉపాధి కల్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ బోర్డు నుంచి అనుమతులు వస్తే.. ఇక ప్లాంటు మొదలైపోయినట్లే. ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 2500 కోట్లతో 431.92హెక్టార్ల […]

ఏపీలో అల్ట్రాటెక్ సిమెంట్ ప్రాజెక్ట్..900 మందికి ఉద్యోగాలు
Follow us

|

Updated on: Jun 10, 2019 | 6:16 PM

భారతదేశంలోని మంచి నాణ్యత గల ఉత్పత్తిగా పేరొందిన అల్ట్రాటెక్ సిమెంట్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌లో రూ.2వేల 500కోట్ల భారీ ప్రాజెక్టు చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వడంతో కర్నూలు జిల్లాలోని పెట్నికొటె గ్రామంలో ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు. ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంటును ఏర్పాటు చేసి 900 మందికు పైగా ఉపాధి కల్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ బోర్డు నుంచి అనుమతులు వస్తే.. ఇక ప్లాంటు మొదలైపోయినట్లే. ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 2500 కోట్లతో 431.92హెక్టార్ల భూమిని ఇప్పటికే కంపెనీ కొనుగోలు చేసింది. అంతకుముందు ఉన్న బిల్డింగ్‌లు, లేదా మరే ఇతర రకమైన సదుపాయాలను వాడుకోకుండా పునాదుల నుంచి కొత్తగా ఈ ప్రాజెక్టును రూపొందించనుంది అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ. ఐదు దేశాల్లో విస్తరించిన ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థల్లో ఒకటే ఈ అల్ట్రాటెక్ సిమెంట్.