AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డేంజర్లో పడిందా ?

ఢిల్లీలో ప్రశాంత్ కనోజియా అనే జర్నలిస్ట్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియోను ప్రసారం చేశాడన్న ఆరోపణపై..సాదా దుస్తుల్లో వఛ్చిన యూపీ పోలీసులు ఆయనను అరెస్టు చేసి,,లక్నో జైలుకు తరలించారు. అయితే ఇలాంటి ఉదంతాలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి సంకెళ్లు వేయడమేనని అప్పుడే మీడియా కోడై కూస్తోంది. ఆదిత్యనాథ్ వ్యక్తిగత జీవితంపై కామెంట్ చేసే అర్హత ప్రశాంత్ కు లేదని, అలాగే ఆయన నుంచి రెస్పాన్స్ లేకుండా, నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఈ […]

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డేంజర్లో పడిందా ?
Pardhasaradhi Peri
| Edited By: Nikhil|

Updated on: Jun 10, 2019 | 6:37 PM

Share

ఢిల్లీలో ప్రశాంత్ కనోజియా అనే జర్నలిస్ట్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియోను ప్రసారం చేశాడన్న ఆరోపణపై..సాదా దుస్తుల్లో వఛ్చిన యూపీ పోలీసులు ఆయనను అరెస్టు చేసి,,లక్నో జైలుకు తరలించారు. అయితే ఇలాంటి ఉదంతాలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి సంకెళ్లు వేయడమేనని అప్పుడే మీడియా కోడై కూస్తోంది. ఆదిత్యనాథ్ వ్యక్తిగత జీవితంపై కామెంట్ చేసే అర్హత ప్రశాంత్ కు లేదని, అలాగే ఆయన నుంచి రెస్పాన్స్ లేకుండా, నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఈ పాత్రికేయుడు ఇలా చేయడం సముచితం కాదని యూపీలోని జర్నలిస్టులు కొందరు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వారు పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీని గురించి ప్రస్తావిస్తూ.. తన ఫోటోను ఫేస్ బుక్ లో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తనొకరిని ఆమె అరెస్టు చేయించలేదా అని ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్ ను కించపరిచేలా కనోజియా వీడియోను పోస్ట్ చేయడమే గాక.. ‘ ఇష్క్ చుప్ తా నహీ..చుపానేసే యోగీజీ ‘ (ప్రేమను దాచిపెట్టినంత మాత్రాన అది దాగదు యోగి గారూ) అని కామెంట్ కూడా చేశాడని, ఇది మరీ అసమంజసంగా ఉందని వారన్నారు.

ఏమైనా ఈ జర్నలిస్ట్ అరెస్టులో యూపీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 500 కింద క్రిమినల్ డిఫమేషన్ అంటూ ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని 66 సెక్షన్ ప్రకారం మరో కేసు పెట్టడం వంటివి సముచితం కాదని సీనియర్ జర్నలిస్టులు చాలామంది అభిప్రాయపడ్డారు. తమకు నచ్చని వార్తలు రాసే, లేక సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేసే పాత్రికేయులపై రాజకీయనాయకులు రకరకాలుగా కక్షలు తీర్చుకుంటున్నారని ప్రధాన్ అనే ఎడిటర్ పేర్కొన్నారు. లోగడ యూపీ మాజీ సిఎం ములాయం సింగ్ యాదవ్ కి చీఫ్ సెక్రటరీగా వ్యవహరించిన ఐఏఎస్ అవినీతి అధికారి అఖండ్ ప్రతాప్ సింగ్ ను తొలగించాలంటూ తాను 2003 లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించానని, అప్పటినుంచీ తనకు బెదిరింపులు అందుతున్నాయని ఆయన తెలిపాడు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇవి మరీ ఎక్కువయ్యాయని ఆయన చెప్పాడు ఇక భవిష్యత్తు సర్కారీ అనుకూల వార్తలదే అవుతుందేమో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

అటు-2002 లో జాతీయ భద్రతా చట్టం కింద యోగి ఆదిత్యనాథ్ మీద కేసు పెట్టినందుకు తనను సస్పెండ్ చేశారని జస్వీర్ సింగ్ అనే ఐపీఎస్ అధికారి తెలిపారు. తమలాంటి వారికి కూడా వాక్స్వాతంత్య్రం లేదని, జర్నలిస్టుల్లాగే తమకూ బెదిరింపులు అందుతుంటాయని ఆయన వెల్లడించాడు. 2017 మార్చి లో బెంగుళూరుకు చెందిన ఓ మహిళ ఫేస్ బుక్ లో యోగి మీద అభ్యంతరకర కంటెంట్ పోస్ట్ చేసినందుకు ఆమె కూడా ‘ బుక్ ‘ అయింది. గోరఖ్ పూర్ లో చాలామంది జర్నలిస్టులు యోగి కాళ్ళ మీద పడడాన్ని తాము చూశామని కొంతమంది పాత్రికేయులు తెలిపారు. యూపీలోనే కాదు..మోదీ ప్రభుత్వం కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే భయపడుతోందని, తనకు నచ్చిన అంశాలకే ప్రాధాన్యం ఇస్తూ.. మీడియాలో వచ్ఛే ‘ అభ్యంతరకర ‘ వార్తలపై మండిపడుతోందని అంటున్న జర్నలిస్టులు..బుధ్దిగా మా పనేదో మేం చేసుకుంటాం అంటున్నారు.