కథువా కేసు తీర్పు: ముగ్గురికి జీవితఖైదు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా హత్యాచారం కేసులో ఆరుగురిని దోషులుగా పటాన్‌కోట్ స్పెషల్ కోర్టు తేల్చిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురికి జీవితఖైదు, మరో ముగ్గురికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇకపోతే హత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న గ్రామ పెద్ద సంజీ రామ్‌తోపాటు సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు తేలిన పోలీస్ అధికారులు పర్వేష్ కుమార్, దీపక్ ఖజూరియాకు కోర్టు జీవితఖైదు విధించింది. ఇక మరో ముగ్గురు దోషులు తిలక్ రాజ్, సురేందర్ […]

కథువా కేసు తీర్పు: ముగ్గురికి జీవితఖైదు!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 10, 2019 | 6:56 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా హత్యాచారం కేసులో ఆరుగురిని దోషులుగా పటాన్‌కోట్ స్పెషల్ కోర్టు తేల్చిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురికి జీవితఖైదు, మరో ముగ్గురికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

ఇకపోతే హత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న గ్రామ పెద్ద సంజీ రామ్‌తోపాటు సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు తేలిన పోలీస్ అధికారులు పర్వేష్ కుమార్, దీపక్ ఖజూరియాకు కోర్టు జీవితఖైదు విధించింది. ఇక మరో ముగ్గురు దోషులు తిలక్ రాజ్, సురేందర్ వర్మ, ఆనంద్ దత్తాకు ఐదు సంవత్సరాల చొప్పున శిక్షను పటాన్‌కోట్ స్పెషల్ కోర్టు ఖరారు చేసింది.

కాగా అంతకముందు గ్రామ పెద్ద సంజీ రామ్, ఆనంద్ దత్తా, పర్వేష్ కుమార్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మలతో పాటు హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్‌లు కోర్టు దోషులుగా పేర్కొంది. మరోవైపు సంజీ రామ్ కుమారుడు విశాల్‌ను నిర్దోషిగా కోర్టు నిర్ధారించింది.

గత ఏడాది జనవరిలో జమ్మూకశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల బాలికను అపహరించి.. 4 రోజులపాటు సామూహిక అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ కేసు విచారణకు జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ అయింది. దాదాపు 17 నెలల పాటు ఈ కేసు విచారణ జరిగింది.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..