Strain Virus: దేశంలో పెరుగుతున్న యూకే స్ట్రెయిన్ వైరస్.. మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
భారత్‌లో యూకే స్ట్రెయిన్ వైరస్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి..
UK Strain Cases: భారత్‌లో యూకే స్ట్రెయిన్ వైరస్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కొత్తరకం కోవిడ్ కేసుల సంఖ్య 165కి చేరింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు ల్యాబ్స్‌లో యూకే కరోనా స్ట్రేయిన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది. ఇప్పటివరకు నమోదైన గణాంకాల ప్రకారం.. ఢిల్లీలోని ఐజీఐబీలో ఎక్కువగా 51 కేసులు నమోదు కాగా.. ఢిల్లీలోని ఎన్‌సీడీసీలో 42, పూణేలోని ఎన్‌ఐవీలో 44, బెంగళూరులోని ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌లో 14, హైదరాబాద్ సీసీఎంబీలో 8, బెంగళూరులోని ఎస్‌సీబీఎస్‌లో 5, కోల్‌కతాలోని ఎన్‌ఐబీజీలో ఒకటి చొప్పున మొత్తం 165 యూకే స్ట్రేయిన్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
The total number of persons infected with the UK variant of Coronavirus reaches 165. pic.twitter.com/hDxKWcEz96
— ANI (@ANI) January 28, 2021
కొరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు పెరగకుండా ఉండేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసి యూకే నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించడంతోపాటు ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు. కొత్తరకం కరోనా పాజిటీవ్ వ్యక్తులతో సంబంధమున్న వారిని కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తుండటంతో ఈ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు.
Also Read: