బంపర్ ఆఫర్.. క‌డుపు నిండా తినండి.. సగం బిల్లు కట్టండి..!

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయి. నిత్యవసర వస్తువుల తప్పిస్తే.. మిగతా విభాగాల్లో అన్ని మూలన పడ్డాయి. అందులో ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్లు మాత్రం తీవ్రంగా..

బంపర్ ఆఫర్.. క‌డుపు నిండా తినండి.. సగం బిల్లు కట్టండి..!
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 3:18 PM

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయి. నిత్యవసర వస్తువుల తప్పిస్తే.. మిగతా విభాగాల్లో అన్ని మూలన పడ్డాయి. అందులో ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్లు మాత్రం తీవ్రంగా నష్టపోయాయి. తిరిగి ఆ వ్యాపారాలు పుంజుకోవడం కూడా అంత ఈజీ కాదు అన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. దీనికి కారణం.. కరోనా భయంతో దాదాపు మెజార్టీ ప్రజలు ఇంటి భోజనంకే పరిమితమవుతున్నారు. దీంతో పలు దేశాల్లో లాక్‌డౌన్ తర్వాత తెరుచుకున్న రెస్టారెంట్లు బోసిపోతున్నాయి. కస్టమర్లు లేక.. వ్యాపారమంతా నష్టాల్లో కొనసాగుతోంది.

అయితే యూకే ప్రభుత్వం.. రెస్టారెంట్ వ్యాపారాలు తిరిగి పుంజుకునేందుకు..  కస్టమర్లను తిరిగి ఆకర్షించేందుకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే.. “కడుపు నిండా ఎంతైనా తినండి.. బిల్లు మాత్రం అందులో సగమే చెల్లించండి..” అంటూ ప్రకటించింది. ఇది “Eat Out To Help Out scheme” కింద ఈ ఆఫర్ ప్రకటించింది.  ఇది ఆగస్టు వరకు మాత్రమే అమలులో ఉంటుందని.. అది కూడా సోమవారం నుంచి బుధవారం మధ్యలోనే వర్తిస్తుందని తెలిపింది. యూకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌లో ఈ ఆఫర్‌ను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆహారం, నాన్ ఆల్కాహల్‌ డ్రింక్స్‌కు మాత్రమే వర్తిస్తుందని.. లిక్కర్‌పై ఈ ఆఫర్ వర్తించదని తెలిపింది. కరోనా మమమ్మారి దరిచేరకుండా.. నిబంధనలను పాటిస్తూ.. ఫుడ్ తింటూ ఎంజాయి్ చేయండంటూ యూకే సర్కార్ పేర్కొంది.