AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Type-2 Diabetes: టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నారా.. తినే ఆహారంలో దీనిని చేర్చుకోండి.. 30 నిమిషాల్లోనే మంచి రిజల్ట్..

Type-2 Diabetes: మధుమేహ వ్యాధి.. దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి.. ఇది రెండు రకాలు.. టైప్ 1 , టైప్ 2 అని వర్గీకరించారు.  ఇందులో టైప్-2 డయాబెటిస్ వ్యాధి ఉన్న..

Type-2 Diabetes: టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నారా.. తినే ఆహారంలో దీనిని చేర్చుకోండి.. 30 నిమిషాల్లోనే మంచి రిజల్ట్..
Type 2 Diabetes
Surya Kala
|

Updated on: Oct 31, 2021 | 9:55 AM

Share

Type-2 Diabetes: మధుమేహ వ్యాధి.. దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి.. ఇది రెండు రకాలు.. టైప్ 1 , టైప్ 2 అని వర్గీకరించారు.  ఇందులో టైప్-2 డయాబెటిస్ వ్యాధి ఉన్న వారికి శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. దీంతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. నయం కానీ వ్యాధుల్లో ఒకటి టైప్ 2 డయాబెటిస్ గా నిలిచింది. అయితే టైప్-2 డయాబెటిస్ లక్షణాలను అదుపులో పెట్టుకోవాటానికి పోషకాహార నిపుణులు అనేక సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా వంట ఇంటిలో ఉండే వస్తువులతోనే టైప్-2 డయాబెటిస్ ను అదుపులో పెట్టవచ్చని అంటున్నారు.

టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే హార్మోనులు తగ్గిన్ని ఉత్పత్తి కావు. దీంతో స్థూలకాయం పెరుగుతుంది. తీవ్రమైన గుండె జబ్బులు వస్తాయి. ముఖ్యంగా శరీరంలోని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకనే ఈ టైప్-2 డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి సహజమైన ఓ పదార్ధాన్ని సూచిస్తున్నారు.

వెనిగర్ ని  చైనీస్ , ఆసియా దేశాల్లోని కొన్ని వంటల్లో తరచుగా ఉపయోగిస్తారు. ఈ వెనిగర్ తినే ఆహారంతో తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అధిక కార్బోహైడ్రేట్స్ పై వెనిగర్  ప్రభావితం చేస్తుందని పలు అధ్యయనాల కథనం.

రాత్రిపూట ఉపవాసం ఉన్న వ్యక్తులకు మర్నాడు అల్పాహారంగా  వైట్ బ్రెడ్‌తో పాటు వెనిగర్ ని ఇచ్చారు. అనంతరం వారి షుగర్ లెవెల్స్ ను పరిశీలించగా..  ఈ వెనిగర్ టైప్-2 డయాబెటిస్ తో బాధపడేవారికి లెవెల్స్ పెరిగేలా చేస్తుందని పరిశోధనల్లో స్పష్టమైంది. అంతేకాదు ఈ వెనిగర్ వలన శరీరంలోని అదనపు కొవ్వు , కొలెస్ట్రాల్ వంటివి కరిగిపోతాయని.. జపాన్ శాస్త్రజ్ఞుల పరిశోధనలో వెల్లడైంది. ఐహితే ఈ వెనిగర్ ను డైరెక్ట్ గా తీసుకోరాదు. ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే.. నీటిలో కలుపుకుని తాగాల్సి ఉంది. బ్లడ్ షుగర్ లెవ్ర్ల్స్ ను మెరుగుపరుస్తుంది.

బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను నియంత్రించడం కోసం..  వారానికి 2.5 గంటల పాటు వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయాలనీ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని , బరువు తగ్గాలని సిఫార్సు చేస్తున్నారు. నడక, జాగింగ్, మెట్లు ఎక్కడం, ఇంటి పనులు , తోటపని చేయడం వంటివి మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచుతామని చెప్పారు. టైప్-2 డయాబెటిస్‌కు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బరువు తగ్గడం అనేది ప్రభావంతమైన చర్య అంటున్నారు.

Also Read: యాక్టర్ సంపత్‌ను బాహుబలి కాజాతో సత్కరించిన మడతకాజా మాతృ సంస్థ..