రౌడీని కాదన్న టాప్ హీరోయిన్లు.. వారెవరంటే.?

రౌడీని కాదన్న టాప్ హీరోయిన్లు.. వారెవరంటే.?

రౌడీ విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో ‘ఫైటర్’ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా కోసం హీరోయిన్ల వేటలో పడ్డారు చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే ఇప్పటికే పూరి, ఛార్మిలు కొందరు స్టార్ హీరోయిన్లతో సంప్రదింపులు జరపగా.. వారు నో చెప్పినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్.. ఈ సినిమాలో భాగమవుతుందని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపించాయి. అయితే రెమ్యునరేషన్ దాదాపు 7 కోట్లు […]

Ravi Kiran

| Edited By: Srinu Perla

Dec 06, 2019 | 3:44 PM

రౌడీ విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో ‘ఫైటర్’ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా కోసం హీరోయిన్ల వేటలో పడ్డారు చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే ఇప్పటికే పూరి, ఛార్మిలు కొందరు స్టార్ హీరోయిన్లతో సంప్రదింపులు జరపగా.. వారు నో చెప్పినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్.. ఈ సినిమాలో భాగమవుతుందని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపించాయి. అయితే రెమ్యునరేషన్ దాదాపు 7 కోట్లు అడగటంతో.. పూరి జగన్నాధ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కూడా డేట్స్ ఎడ్జస్ట్ చేయడం కుదరక ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వినికిడి.

ఇదివరకే కియారా విజయ్‌తో కలిసి ఓ కమర్షియల్ యాడ్‌లో తళుక్కుమంది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్లు తప్పుకోవడంతో విజయ్‌కు సరైన జోడీని వెతికే పనిలో పడ్డాడు పూరి జగన్నాధ్.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu