రేపటి నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అనుమతి
ఆన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ తో మూసివేసిన మార్గాలను పునరుద్ధరిస్తుంది.

ఆన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ తో మూసివేసిన మార్గాలను పునరుద్ధరిస్తుంది. గురువారం నుండి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అయితే, దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే నడకదారిలో అనుమతిస్తామని చెబుతున్నారు. టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ సిబ్బందితో నడకదారిలో ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మెట్ల మార్గాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు. అలాగే రెండు ఘాట్ రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. పూర్వ కాలం నుంచి తిరుమల కొండకు రెండు సోపాన మార్గాలున్నాయి. మొదటిది శ్రీవారి మెట్టు. దీన్నే నూరు మెట్ల దారి అంటారు. ఇది శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వర ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. ఈ మార్గం గుండా భక్తులను అనుమతినిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
