ఆలయ భూముల్ని ఇళ్ల స్థలాలకు ఇచ్చే నిబంధన ఎక్కడ ఉంది..

ఆలయ భూముల్ని ఇళ్ల స్థలాలకు ఇవ్వడంపై ఏపీ హైకోర్టు స్పందించింది. వెంటనే నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. విజయనగరం జిల్లా గుంపం గ్రామంలో ఆలయ భూముల్ని...

  • Sanjay Kasula
  • Publish Date - 8:36 pm, Wed, 4 November 20
ఆలయ భూముల్ని ఇళ్ల స్థలాలకు ఇచ్చే నిబంధన ఎక్కడ ఉంది..

AP High Court Questioned : ఆలయ భూముల్ని ఇళ్ల స్థలాలకు ఇవ్వడంపై ఏపీ హైకోర్టు స్పందించింది. వెంటనే నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. విజయనగరం జిల్లా గుంపం గ్రామంలో ఆలయ భూముల్ని ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కేటాయించింది. ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు భూమిని సిద్ధం చేస్తున్నారని గుంపం గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఆలయ భూముల్ని ఇళ్ల స్థలాలకు ఇచ్చే నిబంధన ఎక్కడ ఉందని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని అధికారులకు కోర్టు సూచించింది.