AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాడిలో పడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థః కేంద్రం

కరోనా ప్రభావంతో చతికిలాపడ్డ దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించిన వృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.

గాడిలో పడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థః కేంద్రం
Balaraju Goud
|

Updated on: Nov 04, 2020 | 8:33 PM

Share

కరోనా ప్రభావంతో చతికిలాపడ్డ దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించిన వృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, జీఎస్టీ వసూళ్లు… ఎనిమిది నెలల గరిష్టానికి చేరుకోవడం, పవర్ డిమాండ్ పెరగడం, ఆటో రంగంలో అమ్మకాల్లో వృద్ది సాధించడం వంటివి గరిష్టాన్ని తాకడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే రైలు సరకు రవాణా కూడా గణనీయంగా పెరిగినట్లు ఆయన తెలిపారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఎకానమిక్ రికవరీ వేగంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోందని, రెండో త్రైమాసికం ఆశాజనకంగా ఉంటుందని జవదేకర్ వెల్లడించారు.

భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా దారిలోకి వస్తోందని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనాకు తోడు భారీ వర్షాల కారణంగా వ్యవసాయ రంగంలో విద్యుత్తు వినియోగం తగ్గినప్పటికీ, రైల్వేలు పూర్తిగా కార్యకలాపాలను ప్రారంభించనప్పటికీ పవర్ డిమాండ్ 12 శాతంపెరగడం గమనార్హమన్నారు జవదేకర్. అటు. ఉత్పత్తి రంగం కూడా సాధారణ స్థితికి చేరినట్లు ఆయన తలిపారు. కొవిడ్ తర్వాత తొలిసారిగా రూ.1.05 కోట్ల మేర జీఎస్టీ వసూలు అయినట్లు వెల్లడించారు. అలాగే ఏప్రిల్ – ఆగస్టు మద్య కాలంలో భారతదేశంలోకి 35.73 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని.. ఇది దేశ ఆర్థక వ్యవస్థకు మద్దతుగా నిలిచిందన్నారు.

కాగా… భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోన్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఏప్రిల్ ఆగస్ట్ కాలంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ 13 శాతం పెరిగాయని ఎకనమిక్ అఫైర్ సెక్రటరీ తరుణ్ బజాజ్ తెలిపారు. రికవరీ స్పీడ్… 2020 21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసిన విషయం తెలిసిందే.