అర్నాబ్ అరెస్టు తో మహారాష్ట్ర, కేంద్రానికి మధ్య ‘వివాదం’

రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టుతో మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం తలెత్తింది. ఆయన అరెస్టును ఖండిస్తూ పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ట్వీట్లు చేశారు. అయితే చట్టం ప్రకారం తాము నడచుకున్నామని, ఇది ఏ పార్టీకీ సంబంధించినది కాదని మహారాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఈ అరెస్టు పత్రికా స్వేఛ్చపై దాడిగా కేంద్ర మంత్రులు అ భివర్ణించారు  పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీని కూడా దుయ్యబట్టారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు మరోసారి […]

అర్నాబ్ అరెస్టు తో మహారాష్ట్ర, కేంద్రానికి మధ్య 'వివాదం'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 04, 2020 | 8:24 PM

రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టుతో మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం తలెత్తింది. ఆయన అరెస్టును ఖండిస్తూ పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ట్వీట్లు చేశారు. అయితే చట్టం ప్రకారం తాము నడచుకున్నామని, ఇది ఏ పార్టీకీ సంబంధించినది కాదని మహారాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఈ అరెస్టు పత్రికా స్వేఛ్చపై దాడిగా కేంద్ర మంత్రులు అ భివర్ణించారు  పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీని కూడా దుయ్యబట్టారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు మరోసారి ప్రజాస్వామ్యాన్ని సిగ్గుపరిచారని హోమ్ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. కానీ ఈ వ్యాఖ్యలను మహారాష్ట్ర ఎన్సీపీ మంత్రి నవాబ్ మాలిక్, మరికొందరు ఖండించారు.