Tirumala News: ‘భక్తులపై లాఠీ ఛార్జ్ చేయలేదు’..తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన..ఆ డ్రోన్లు సీజ్ చేసినట్లు వివరణ
స్థానికంగా ఆధార్ కార్డు ఉన్నవారికే సర్వదర్శనం టోకెట్లు జారీ చేయడంత ఇటీవల తిరుమలలో గందరగోళం నెలకున్న విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆందోళనకు దిగడంతో..
Tirumala News: స్థానికంగా ఆధార్ కార్డు ఉన్నవారికే సర్వదర్శనం టోకెట్లు జారీ చేయడంత ఇటీవల తిరుమలలో గందరగోళం నెలకున్న విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆందోళనకు దిగడంతో..పోలీసులు, ఆలయ అధికారులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. భక్తులపై లాఠీఛార్జ్ చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం..ఈ ఘటనపై ఆరోపణలు గుప్పించారు. ఈ విమర్శలపై టీటీడీ స్పందించింది. శ్రీవారిమెట్టు వద్ద ఆందోళనకు దిగిన భక్తులపై లాఠీఛార్జ్ చేయలేదని స్పష్టం చేసింది. టోకెన్లు ఉన్నవారినే అనుమతిస్తామని ముందుగా చేసిన ప్రకటనను.. భక్తులకు వివరించి సర్ది చెప్పినట్టు వివరించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్న వారు మాత్రమే తిరుమలకు రావాలని ముందే చేసిన ప్రకటనను భక్తులను అర్థమయ్యేలా వివరించినట్లు తెలిపింది