గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే..
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేయించడం జరుగుతుంది. తాజాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో టీటీడీ చైర్మన్ వై విసుబ్బారెడ్డి పాల్గొన్నాడు. విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ సాత్వానంద సరస్వతి స్వామీజీ గారు ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి.. ఈ రోజు తిరుమల కొండపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. మానవ మనుగడ కొనసాగాలంటే చెట్లు మనకు ఎంతో ముఖ్యం అని మొక్కలు నాటాడం ఛాలెంజ్‌గా తీసుకొని నాటాలని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చాలా చక్కటి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్నారని తెలిపారు. మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
Also Read:
జగనన్నకి, వదినమ్మకి పెళ్లిరోజు శుభాకాంక్షలు: ఎమ్మెల్యే రోజా
కరోనా టైంలో ఆయుర్వేదిక్ చికెన్ బిర్యానీ.. ధర ఎంతంటే?
గాంధీ నుంచి పరారైన కోవిడ్ పాజిటివ్ ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు
హీరో సుధాకర్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్‌కి ఫిదా అయిన మెగాస్టార్