AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG LAWCET 2026 Registration: తెలంగాణ లాసెట్‌ 2026 రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు.. ఇదే చివరి ఛాన్స్!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ (LLB) కోర్సులతో పాటు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం (LLM) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ లాసెట్ (TG LAWCET), టీజీ పీజీఎల్‌సెట్ (TG PGLCET) 2026 దరఖాస్తును గడుగిస్తూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన..

TG LAWCET 2026 Registration: తెలంగాణ లాసెట్‌ 2026 రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు.. ఇదే చివరి ఛాన్స్!
TS LAWCET Application Last Date
Srilakshmi C
|

Updated on: Apr 05, 2026 | 5:52 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ (LLB) కోర్సులతో పాటు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం (LLM) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ లాసెట్ (TG LAWCET), టీజీ పీజీఎల్‌సెట్ (TG PGLCET) 2026 దరఖాస్తును గడుగిస్తూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఏప్రిల్ 1తో ముగిసింది. తాజా ప్రకటన మేరకు అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల సౌకర్యార్థం ఈ మేరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. లాసెట్‌ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని లా కాలేజీల్లో 3 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ, 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష మే 18న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్‌ 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులకు ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఇంటర్మీడియట్‌, ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. లాసెట్‌ పరీక్ష ఇంగ్లిష్/ తెలుగు, ఇంగ్లిష్/ ఉర్దూ మీడియంలలో ఉంటుంది. పీజీఎల్‌సెట్‌ ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద లాసెట్‌కు జనరల్‌ అభ్యర్ధులు రూ.900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.600 చొప్పున చెల్లించాలి. పీజీఎల్‌సెట్‌కు జనరల్ అభ్యర్ధులు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.900 చొప్పున చెల్లించాలి. తుది గడువులోగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని అధికారులు సూచించారు. రూ.500 నుంచి 10,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 15, 2026 నుంచి మే 13, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us