పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌లో కారు జోరు

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ సత్తా చాటింది.

పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌లో కారు జోరు
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 10, 2020 | 2:55 PM

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఇందులో భాగంగా ఉద‌యం 8 గంట‌ల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కించారు. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 1,453 పోల‌వ్వ‌గా, అందులో 1,381 ఓట్లు మాత్ర‌మే చెల్లుబాటు అయ్యాయి. చెల్లుబాటైన ఓట్ల‌లో టీఆర్ఎస్ పార్టీకి 720, బీజేపీకి 368, కాంగ్రెస్ పార్టీకి 142 ఓట్లు పోల‌య్యాయి. స్వ‌తంత్ర అభ్య‌ర్థి బండారు నాగ‌రాజుకు 60 ఓట్లు వ‌చ్చిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు. మరో స్వతంత్ర అభ్యర్థి కత్తి కార్తీకకు 15 ఓట్లు పోలవ్వగా, సిలివేరు శ్రీకాంత్ 11 ఓట్లను సాధించారు. ఇక, అభర్థులు ఎవరు రెండు సంఖ్యను కూడా దాటలేకపోయారు. మొత్తం 72 ఓట్లు చెల్లని ఓట్లుగా అధికారులు తేల్చారు.

ఇక ఈవీఎం లెక్కింపు ఓట్ల‌లో స్వ‌ల్ప మెజార్టీతో బీజేపీ ముందంజ‌లో ఉంది. తొలి ఐదు రౌండ్లు, 8, 9, 11 రౌండ్ల‌లో బీజేపీ లీడ్‌లో ఉండ‌గా, 6, 7, 10 రౌండ్ల‌లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. 6, 7, 10 రౌండ్ల‌లో టీఆర్ఎస్ పార్టీ 353, 182, 456 ఓట్ల మెజార్టీ సాధించింది. 11వ‌ రౌండ్‌లో బీజేపీ 199 ఓట్ల ముందంజ‌లో ఉంది.