ఏపీలో సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక పాలసీ!

సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని సీఎం జగన్ వెల్లడించారు. మార్కెట్‌లో ఉన్న రేటు కంటే తక్కువరేటుకే ఇసుక అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆయన సూచించారు. ఇసుక సరఫరా పెంచాలని… లేకపోతే రేట్లు తగ్గవని తెలిపారు. రవాణాలో ఇబ్బంది రాకుండా చూడాలని… ఎక్కువమందికి అవకాశం ఇవ్వాలని అధికారులకు సీఎం తెలిపారు. గుర్తించిన స్టాక్‌ యార్డుల్లో ఇప్పట్నుంచే ఇసుక నింపడం మొదలుపెట్టాలన్నారు. అవకాశం ఉన్న ప్రతిచోటా ఇసుక రీచ్‌లు పెంచాలని తెలిపారు. వరదల వల్ల […]

ఏపీలో సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక పాలసీ!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 27, 2019 | 5:45 PM

సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని సీఎం జగన్ వెల్లడించారు. మార్కెట్‌లో ఉన్న రేటు కంటే తక్కువరేటుకే ఇసుక అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆయన సూచించారు. ఇసుక సరఫరా పెంచాలని… లేకపోతే రేట్లు తగ్గవని తెలిపారు. రవాణాలో ఇబ్బంది రాకుండా చూడాలని… ఎక్కువమందికి అవకాశం ఇవ్వాలని అధికారులకు సీఎం తెలిపారు. గుర్తించిన స్టాక్‌ యార్డుల్లో ఇప్పట్నుంచే ఇసుక నింపడం మొదలుపెట్టాలన్నారు. అవకాశం ఉన్న ప్రతిచోటా ఇసుక రీచ్‌లు పెంచాలని తెలిపారు. వరదల వల్ల కొత్త రీచ్‌లు పెట్టే అవకాశం వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. ఇసుక రీచ్‌ల్లో ఎవరూ తప్పు చేయకుండా చూడాలని సీఎం జగన్‌ అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై చెడ్డపేరు తెచ్చేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారని జగన్ అధికారులతో అన్నారు.